నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య.. ప్రిన్సిపల్ను పరిగెత్తించి కొట్టిన బంధువులు
మేడ్చల్ – అన్నోజిగూడలోని నారాయణ కాలేజీలో విద్యార్థి తనూష్ (16) ఆత్మహత్య వ్యవహారం ఉద్రిక్తంగా మారింది.
కుమారుడిని విగతజీవిగా చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కాలేజీ గేట్ తాళం విరగ్గొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు.
మీ వేధింపుల వల్లే సూసైడ్ చేసుకున్నాడని ప్రిన్సిపల్ రామ్ రెడ్డిని పరిగెత్తించి కొట్టారు.
పోలీసులు జోక్యం చేసుకొని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు…
మేడ్చల్, అన్నోజిగూడ: ఎంపిసి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి తనూజ్ నాయక్ (16) ఆత్మహత్య చేసుకోవడంతో అన్నోజిగూడలోని నారాయణ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాలేజీ రెస్ట్రూమ్లో జరిగిన ఈ ఘటనపై లెక్చరర్లు వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో తీవ్రస్థాయికి చేరుకుంది.
శోకసంద్రంలో మునిగిన తల్లిదండ్రులు మరియు బంధువులు, తనూజ్ మృతదేహాన్ని గుర్తించి, గేటు తాళం పగులగొట్టి కళాశాల ప్రాంగణంలోకి దూసుకెళ్లారు. కోపం, వేదనతో వారు తమ కుమారుడి ఆత్మహత్యకు కళాశాల ప్రిన్సిపాల్ రామ్రెడ్డితో పాటు ఆ సంస్థే కారణమని ఆరోపిస్తూ అతడిని కలిశారు. ఈ క్రమంలో జరిగిన గందరగోళంలో ప్రిన్సిపాల్పై బంధువులు వెంబడించి భౌతికంగా దాడి చేసినట్లు సమాచారం…పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగప్రవేశం చేసి కళాశాల సిబ్బందిపై వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు..