సూర్యాపేట – ఖమ్మం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం…

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం

నలుగురు ప్రయాణికులు మృతి..17 మందికి గాయాలు…

సూర్యాపేట – ఖమ్మం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.

ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.

స్పాట్ లోనే నలుగురు మృతి… మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు.

ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్ సూర్యాపేట సమీపంలో ఖమ్మం హైవేపై రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.
17 మందికి గాయాలు కావడంతో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ తరలించారు.
పోలీస్ లు సహాయక చర్యలు చేపట్టారు