బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం…!

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.

బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం.

ఉత్తర-వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం.

రేపటికి తుఫానుగా బలపడనున్న వాయుగుండం
తుఫానుగా మారాక అక్వాన్‌గా నామకరణం
17న తీవ్ర తుఫానుగా మారే అవకాశం
పోర్ట్ బ్లెయిర్‌కు 700 కి.మీ, చెన్నైకి 860 కి.మీ..

విశాఖకు 1040 కి.మీ. దూరంలో వాయుగుండం.

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు.

ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండం (Depression) గా మారింది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా నివేదిక ప్రకారం, ఇది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తీరం దాటే ప్రాంతం. ఈ తుఫాను ఉత్తర కోస్తాంధ్ర వైపు కదులుతూ నవంబర్ 19 రాత్రి తర్వాత తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది…

బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. అండమాన్ దీవులుకు 700 కి. మీ., చెన్నైకు 860 కి. మీ. విశాఖపట్నంకు 1040 కి. మీ., గోపాల్‌పూర్ ఒడిశాకు 1160 కి. మీ. దూరంలో కేంద్రీకృతమై కొనసాగుతోంది. ఉత్తర-వాయువ్య దిశగా కదులుతు వాయుగుండం మరింత బలపడుతుంది. రేపటికి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం తుఫానుగా మారాక ఇరాన్ దేశం సూచించిన అక్వాన్‌గా నామకరణం చేస్తారు..18న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 19న శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు ఆరంజ్ అలర్ట్. పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, కాకినాడ, ఏలూరు,ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈనెల 19 రాత్రి తర్వాత ఏపీలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేస్తోంది. ఇదిలాఉంటే.. తీవ్ర తుఫాను ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది..