గణేష్ నవరాత్రుల సందర్భంగా 17వ వార్డులో ఘనంగా అన్న ప్రసాదం కార్యక్రమం..
హుజూర్నగర్: గణేష్ నవరాత్రుల సందర్భంగా హుజూర్నగర్ మున్సిపాలిటీ 17వ వార్డులో అన్న ప్రసాదం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 17వ వార్డు కౌన్సిలర్ బెల్లంకొండ సంధ్యా అమర్, మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు హాజరై అన్న ప్రసాదం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గణేష్ నవరాత్రులు భక్తి, ఆధ్యాత్మికతతో పాటు సేవా భావాన్ని పెంపొందించే పర్వదినాలని, ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, సోదరభావం, సేవా స్పూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. భక్తులకు అన్నప్రసాదం అందించడం ఎంతో పుణ్యకార్యమని తెలిపారు.
కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, చక్రాల శిరీష దొంతగాని సుజాత అలవా ఆంజమ్మ స్థానిక నాయకులు, యువకులు, మహిళలు, వార్డు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అన్నప్రసాద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను ముఖ్య అతిథులు అభినందించారు. భవిష్యత్తులో కూడా ప్రజల భాగస్వామ్యంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.