2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఎంపిక
అహ్మదాబాద్ వేదికగా 2030 కామన్వెల్త్ గేమ్స్.
దేశ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులకు గుడ్ న్యూస్. 2030 కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) నిర్వహణకు భారత్ ఎంపికైంది. అయితే, ఇటీవలే దేశంలో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహిస్తామని గుజరాత్ సర్కార్ (Gujarat Government) భారత ప్రభుత్వం సూచన మేరకు కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (CGF)లోని కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎవాల్యూయేషన్ కమిటీకి ప్రతిపాదనలు పంపింది. అందులో అహ్మదాబాద్ (Ahmadabad)ను హోస్ట్ సిటీగా వేదికగా నిర్ణయించింది. అయితే, తాజాగా గుజరాత్ ప్రభుత్వ ప్రతిపాదనకు కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎవాల్యూయేషన్ కమిటీ (CSA) ఓకే చెప్పింది. దీంతో 2030లో అహ్మదాబాద్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఈ ఈవెంట్లో 72 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని సమాచారం. .