పొలంలో ఆరడుగుల భూమి లోపల ఏర్పాటుచేసుకున్న పైపులు పగిలిపోవడంతో వాటిని మరమ్మతు చేయడానికి భూమిని తవ్వగా.. బాంబు పిన్ కనిపించిందని అతడు పేర్కొన్నాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి వచ్చి వివిధ పరీక్షలు జరిపారు. భూమిలో భారీ పేలుడు పదార్థం ఉన్నట్లు గుర్తించారు. అది పేలే అవకాశం ఉన్నందున ప్రజలను ఆ ప్రాంతం నుంచి తరలించారు..
దీనిని వెలికితీయడానికి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన అనంతరం పుణెలోని 10మంది వైమానిక, ఆర్మీ దళ అధికారులు వర్వాండికి చేరుకున్నారు. నెల రోజుల పాటు శ్రమించి జేసీబీ సహాయంతో బాంబు చుట్టూ ఏడడుగుల గొయ్యి తవ్వి.. బాంబు స్కాడ్ బృందాల సహాయంతో తొలుత దానిని నిర్వీర్యం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అది నాలుగున్నర అడుగుల పొడవు, నాలుగు అడుగుల వ్యాసం, 453 కిలోల బరువున్నట్లు తెలిపారు. అనంతరం దానిని ఓ ప్రత్యేక వాహనంలో అహల్యానగర్లోని కెకె రేంజ్కు తరలించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడినట్లు అధికారులు వెల్లడించారు.
బాంబును తరలించే సమయంలో ఆ మార్గంలో అరగంట పాటు వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. బాంబు పేలిఉంటే కిలోమీటరు మేర ఉన్న ఇళ్ళు పూర్తిగా ధ్వంసమై ఉండేవని.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించేదని అధికారులు పేర్కొన్నారు. భూమిలో భారీగా ప్రకంపనలు సంభవించేవని తెలిపారు. పెద్ద ప్రమాదాన్ని తప్పించినందుకు రైతును అభినందించారు. బాంబు అక్కడికి ఎలా వచ్చింది అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.