ప్రపంచంలోనే అత్యంత అధునాతన వాయు రక్షణ వ్యవస్థగా పేరొందిన ‘ఎస్-500’ ఆధారిత సాంకేతికతను భారతదేశంతో కలిసి ఉమ్మడిగా అభివృద్ధి చేయడానికి మాస్కో సిద్ధంగా ఉన్నట్లు రష్యా వర్గాలను ఉటంకిస్తూ ‘ఐడిఆర్డబ్ల్యూ’ (IDRW) పేర్కొంది.
S-500 Air Defense System:
నిజానికి ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఏర్పడిన అంతర్గత భద్రతా అవసరాల దృష్ట్యా, గతంలో ఎస్-500 వ్యవస్థను నేరుగా భారతదేశానికి విక్రయించడానికి రష్యా నిరాకరించింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ, నేరుగా విక్రయించే బదులు.. ఎస్-500 సామర్థ్యాలను భారతదేశంతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి మొగ్గు చూపింది. రష్యా నుంచి వచ్చిన ఈ ప్రతిపాదన భారతదేశపు ప్రస్తుత, భవిష్యత్ బహుళ అంచెల వాయు రక్షణ నిర్మాణాన్ని మరింత శక్తివంతం చేయనుంది.
ఏమిటీ సుదర్శన్ చక్ర ప్రాజెక్ట్?
భారతదేశం తన సొంత గగనతల రక్షణ అవసరాల కోసం ‘ప్రాజెక్ట్ సుదర్శన్ చక్ర’ను అభివృద్ధి చేస్తోంది. ఇది కేవలం ఒక క్షిపణి వ్యవస్థ మాత్రమే కాదు; సుదూర ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు (LR-SAM), బాలిస్టిక్ క్షిపణి రక్షణ (BMD) వ్యవస్థలు, నిఘా సెన్సార్లు, అత్యాధునిక రాడార్లు, కమాండ్-అండ్-کంట్రోల్ నెట్వర్క్లను ఒకే గొడుగు కిందకు తెచ్చే ఒక సమీకృత నెట్వర్క్. ఇది ఇప్పటికే భారత్ వద్ద ఉన్న రష్యన్ ఎస్-400 వ్యవస్థతో పాటు, స్వదేశీ వాయు రక్షణ ప్రాజెక్ట్ ‘కుషా’ (Project Kusha) లతో కలిసి సమన్వయంతో పనిచేస్తుంది.
వ్యూహాత్మక ప్రాధాన్యత – టెక్నాలజీ బదిలీ
బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కొనేందుకు భారత్ ఇప్పటికే స్వంత మార్గసూచితో బాలిస్టిక్ క్షిపణి రక్షణ ఫేజ్-I ను మోహరించింది. ఇది అంతరిక్షం వెలుపల, వాతావరణం లోపల వచ్చే క్షిపణులను అడ్డుకుంటుంది. ఇలాంటి తరుణంలో రష్యా ప్రతిపాదన భారత్కు అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే, ఈ ప్రతిపాదన కేవలం ఆయుధాల కొనుగోలుకు పరిమితం కాకుండా, అత్యంత కీలకమైన సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి ప్రాధాన్యత ఇస్తుంది..