7, 8 మోదీ మలేషియా టూర్..!

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 7, 8 తేదీల్లో రెండు రోజుల పాటు మలేషియాలో పర్యటించనున్నారు. వాణిజ్యం, శక్తి, సముద్ర భద్రత, పెట్టుబడులు తదితర అంశాలపై ఆ దేశంతో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అక్కడ నివసిస్తున్న భారతీయులు, వాణిజ్య, వ్యాపారవేత్తలతో సమావేశమవుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, ప్రధాని మోదీ మలేషియాను సందర్శించడం ఇది మూడోసారి.