75 ఏళ్ల రామ్‌సుగర్, 30 ఏళ్ల రాణి రాజ్‌పుత్ ప్రేమించి పెళ్లి,,

ఉత్తరప్రదేశ్‌లో 45 ఏళ్ల వయసు తేడా ఉన్న జంట ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 75 ఏళ్ల రామ్‌సుగర్, 30 ఏళ్ల రాణి రాజ్‌పుత్ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం జరగ్గా, అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కూతురితో వీడియోలు చేసేందుకు వచ్చి.. తండ్రితో ప్రేమలోకి!
https://x.com/ArunAzadchahal/status/2110685535761019387?s=20ప్రేమకు వయసుతో సంబంధం లేదనే మాటను గుర్తు చేసే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సహార్ ప్రాంతం అరియారీ గ్రామానికి చెందిన రామ్‌సుగర్‌కు ఓ కుమార్తె ఉంది. ఆమె పేరు రాధ. యూట్యూబ్ వీడియోలు చేసే రాధకు సోషల్ మీడియాలో బ్లాగర్‌గా గుర్తింపు పొందిన రాణి రాజ్‌పుత్‌తో పరిచయం ఏర్పడింది.

దయాల్‌పూర్‌కు చెందిన 30 ఏళ్ల రాణి.. రాధతో కలిసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చిత్రీకరించేందుకు గత ఏడాదిన్నర నుంచి రెండేళ్లుగా రామ్‌సుగర్ ఇంటికి తరచూ వెళ్లేది. ఈ క్రమంలో రాణికి రామ్‌సుగర్‌తో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా సాన్నిహిత్యంగా మారి, చివరకు ప్రేమగా మారినట్లు కథనాలు వెల్లడించాయి.

తండ్రి ప్రేమకు కుమార్తె అంగీకారం!

రామ్‌సుగర్ ప్రేమ వ్యవహారంపై ఆయన కుమార్తె రాధ సానుకూలంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. తన తల్లి సుమారు ఏడేళ్ల క్రితమే మరణించిందని, రాణి తరచూ ఇంటికి రావడంతో తమ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయిందని రాధ తెలిపింది. రామ్‌సుగర్, రాణి మధ్య ప్రేమ విషయం కుటుంబ సభ్యులందరికీ తెలుసునని, వారిద్దరి వివాహానికి కుటుంబం అంగీకరించిందని వెల్లడించింది. దీంతో ఈ జంట పెళ్లి నిర్ణయానికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించింది.