మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు. ఆమె ఓఎస్డీ సుమంత్ పై ప్రభుత్వం నిన్న వేటు వేసింది. అయితే అతను మంత్రి ఇంట్లో ఉన్నాడనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో వారు మంత్రి ఇంటికి చేరుకున్నారు. అయితే కొండా సురేఖ కూతురు సుస్మిత పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుమంత్ కోసం వస్తే…మఫ్టీలో ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. ఏ కారణం మీద అన్ని అరెస్ట్ చేయబోతున్నారు? అంటూ పోలీసులకు ఆమె ప్రశ్నల వర్షం కురింపించారు. ఇదంతా తన తండ్రిని ఇరికించేందుకు జరుగుతున్న కుట్ర అని సుస్మిత ఆరోపిస్తున్నారు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం…

మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు

హైడ్రామా

ఆమె మాజీ ఓఎస్టీ సుమంత్ కోసం మంత్రి నివాసానికి వచ్చిన పోలీసులు వాగ్వాదానికి దిగిన సురేఖ కుమార్తె సుస్మిత తమ కుటుంబంపై సీఎం రేవంత్, పొంగులేటి, వేం నరేందర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు రెడ్లు అంతా కలిసి బీసీ మంత్రి అయిన తన తల్లిని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ సుమంత్ డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను రివాల్వర్తో బెదిరించారని ఆరోపణలు ఉత్తమ్ ఫిర్యాదు మేరకు పోలీసుల చర్యలు?..

మఫ్టీలో ఉన్న పోలీసుతో మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత...

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రభుత్వం సుమంతు మంగళవారమే ఓఎస్టీ పోస్టు..

నుంచి తొలగించగా.. బుధవారం ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని మంత్రి నివాసంలో..

సుమంత్ ఉన్నారన్న సమాచారంతో టాస్క్ పోర్ట్ పోలీసులు బుధవారం రాత్రి మల్లీలో అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకొంది. అక్కడికి వచ్చిన టాస్క్ఫోర్స్ పోలీ సులతో కొండా సురేఖ కుమార్తె సుస్మిత వాగ్వా దానికి దిగారు. విషయం తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ ఇంటి బయటికి పచారు అదే సమయంలో జూబ్లీహిల్స్ పోలీసులు, మీడియా కూడా అక్కడికి చేరుకున్నారు. మంత్రి సురేఖ కారులో బయటికి వెళ్లిపోగా. మస్తిత మీడియాతో మాట్లాడారు. అయితే తన నియోజకవర్గం హుజూర్నగర్ పరిధిలో ఉన్న డెక్కన్ సిమెంట్స్ కుపెనీ ప్రతినిధులను సుమంత్ దివాల్వర్ బెదిరించారని మంత్రి ఉత్తమ్ సీఎంకు ఫిర్యాదు చేశారని.. కార ఇంతోనే మాజీ ఓఎస్టీ అరెస్టుకు రంగం సిద్ద మైందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు టాస్పోర్ట్ పోలీసులు వచ్చిన సమయంలోనే కొండా సురేఖ సుమంత్ను తన కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారని సమాచారం. అయితే ఏకంగా మంత్రి నివాసానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు రాత్రి సమయంలో వెళ్లడం, ఆమె ఓఎస్టీగా పనిచేసి, ఉద్యోగం నుంచి తొల గింపునకు గురైన వ్యక్తిని అరెస్టు చేయడానికి ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది రెడ్లు అంతా కలసి కుట్రు సుస్మిత..

సుమంత్ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో కొండా సురేఖ కుమార్తె వాగ్న్యాడా నికి దిగాడు. “మేం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా? వేరే ప్రభుత్వంలో ఉన్నామా? సుమంత్ మా ఇంట్లో ఉన్నాడు. అయితే

తప్పేంటి? మేం రేవంత్రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నవారిపై ఇలా వ్యవహరించడమేమిటి?” అని పోలీసు లపై మండిపడ్డారు. అనంతరం అక్కడికి వచ్చిన మీడియాతో సున్నిత మాట్లాడారు. తన తల్లి సురేఖను, తండ్రి కొండా మురళిని వేదించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బంధువులకు చెందిన వెక్కన్ సిమెంట్స్ యాజమాన్యాన్ని సుమంత్ ఆయుదం చూపించి బెదిరించారంటూ పోలీసులు కేసు పెట్టారని, తన తండ్రిని కూడా ఇరికించాలనే కుట్రతో సీఎం రేవంత్రెడ్డి మంత్రి పొంగు లేటి శ్రీనివాన్రెడ్డి, వేం నరేందర్రెడ్డి, మరికొం దరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. “డెక్కన్ సిమెంట్స్ కంపెనీలో నెలకొన్న సమ వ్యలను సరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు డీసీసీ అధ్యక్షుడు రోహిన్రె డ్డి కొన్నిరోజుల క్రితం సుమంత్ను పిలిపించి

మాట్లాడాడు. అనంతరం వారిద్దడూ కలిసి డెక్కన్ సిమెంట్స్ కంపెనీకి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. మరి సుమంత్పై కేసుపెట్టిన పోలీసులు రోహిన్రెడ్డిని ఎందుకు విస్మరించాడు?” సుస్మిత ప్రశ్నించారు. బీసీ మంత్రి అయిన తన తల్లిని అణగదొక్కేందుకు పార్టీలోని రెడ్లు అంతా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు రాహుల్గాంధీ బీసీల నూ కోసం పనిచేస్తామని చెబుతుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చర్యలతో బీసీలను తక్కిస్తుందా? అని ప్రశ్నించారు. తన తండ్రికి ప్రాణభయం ఉందని పేర్కొన్నారు. వరంగల్ ఈ గతంలో వేం నరేందర్ రెడ్డి పోటీచేసి ఓడిపోయారని గుర్తుచేశారు. ఇప్పుడు తమ కుటుంబాన్ని అణగదొక్కాలనే కుట్ర వెనుక వేం నరేందర్రెడ్డి, కడియం శ్రీహరితోపాటు సీఎం పాత్ర కూడా ఉందని ఆరోపించారు.

సీఎం పర్యటనకు దూరంగా సురేఖ

వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు మంత్రి గొండా సురేఖ దూరంగా ఉండటం గమనార్హం. నర్నంపేట ఎమ్మెల్యే దొంతి సూప వరెడ్డి తల్లి దశదిన కర్నలో పాల్గొనేందుకు రేవంత్ వరంగల్కు వచ్చారు. సీఎం వెంట ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ డ్డి, సీతక్కు పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కానీ వరంగల్కు చెందిన సురేఖ ఆ పర్యటనకు దూరంగా ఉన్నారు. మేడారంలో రూ.71కోట్లతో సమ్మక్క సారక్క గద్దెల ఇరునీ కరణకు పిలిచిన టెండర్లను తనకు తెలియ కుండానే మంత్రి పొంగులేటి తన సొంత కంపెనీలకు ఇప్పించుకున్నారని. ఇది కొండా దంపతులకు నచ్చలేదని ప్రచారం జరిగింది..

పోలీసులు ఎదురుగా ఒకే కారులో మంత్రి తో వెళ్లిపోయిన osd.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని గాయత్రి హిల్స్ లోని మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ పై కాంగ్రెస్ ప్రభుత్వం వేటు వేసింది. ఈ నేపథ్యంలో అతను సురేఖ ఇంట్లోనే ఉన్నాడనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇప్పటికే ఫిర్యాదులున్న సుమంత్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్ళారు. అయితే పోలీసులు మఫ్టీలో వెళ్ళడంతో…వారిని సురేఖ కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు. మఫ్టీలో ఎందుకు వచ్చారని…మీరెవరని ప్రశ్నలు అడిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము పోలీసులమని, సుమంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చామని చెప్పగా… ఆమె తాను ఇంట్లోకి అనుమతించనంటూ అడ్డుకున్నారు. ఈ లోపు మంత్రి సురేఖ, సమంత్ లో బయటకు వచ్చి పోలీసుల ఎదురుగానే ఒకే కారులో బయటకు వెళ్ళిపోయారు.

కాంగ్రెస్ పెద్దలు కావాలనే ఇదంతా చేస్తున్నారు..
కావాలనే తమ తల్లిదండ్రులపై కుట్రపన్నుతున్నారని మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత అంటున్నారు. కాంగ్రెస్ పెద్దలే ఇవన్నీ చేస్తున్నారంటూ ఆరోపించారు. బీసీలకు ప్రాధాన్యమివ్వాలని రాహుల్‌గాంధీ అంటుంటే.. పెద్దలు తమను తొక్కేస్తున్నారని అన్నారు. నిజానికి పోలీసులు సుమంత్ ను అరెస్ట్ చేయడానికి రాలేదని…అతనిని అడ్డుపెట్టుకుని మా అమ్మ సురేఖను అదుపులోకి తీసుకునేందుకు వచ్చారని సుస్మిత మీడియా ఎదుట ఆరోపించారు. తప్పులు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను వదిలేసి తమ మీద పడ్డారని అన్నారు. సుమంత్‌ను అదుపులోకి తీసుకుని కొండా మురళి చెబితేనే నేను బెదిరించానని ఆయనతో పోలీసులు తెల్లకాగితంపై రాయించి, ఆ తర్వాత మా నాన్నను అరెస్ట్‌ చేస్తారు. ఇప్పటికే మా నాన్నకు గన్‌మెన్‌ను తొలగించారు అంటూ సుస్మిత మండిపడ్డారు. వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఈ వ్యవహారం వెనుక ఉన్నారని అన్నారు…