మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రామా..!

ఆమె ఇంట్లోనే ఉన్న మాజీ ఓఎస్‌డీ సుమంత్‌
ఆయన్ను అరెస్టు చేయడానికి వచ్చామన్న పోలీసులు..

అడ్డుకున్న సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత.. తీవ్ర వాగ్వాదం..

ఆరోపణలు వస్తే అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్న?..

మరి రేవంత్‌ సన్నిహితుల అవినీతి సంగతేంటని నిలదీత..

సుమంత్‌ జోలికొస్తే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరిక..
https://x.com/TeluguScribe/status/1978547156073021681
మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు మంత్రి ఇంటిపైకి వచ్చిన పోలీసులపై సురేఖ, ఆమె కూతురు సుస్మిత మండిపడ్డారు. వారిలో మహిళా పోలీసులు కూడా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హైడ్రామా కొనసాగుతుండగానే మాజీ ఓఎస్డీ సుమంత్‌ను తన వెంట కారులో ఎక్కించుకుని కొండా సురేఖ అక్కడినుంచి వెళ్లిపోయారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ వద్ద కాంట్రాక్టు పద్ధతిలో ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్‌ను పలు ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం విధుల నుంచి తొలగించింది. అయితే మంత్రినైన తనకు సమాచారం ఇవ్వకుండానే సుమంత్‌ను ప్రభుత్వం తొలగించడంపై మంత్రి సురేఖ ఆగ్రహంతో ఉన్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఉన్న దక్కన్‌ సిమెంట్‌ నుంచి డబ్బులు డిమాండ్‌ చేసేందుకు సుమంత్‌ గన్‌తో బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం నుంచే సుమంత్‌ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో సుమంత్‌ మంత్రి ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు జూబ్లీహిల్స్‌లోని సురేఖ నివాసానికి బుధవారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వచ్చారు. మఫ్టీలో ఉన్న వారిని గేటు వద్దే అడ్డుకున్న మంత్రి సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత.. పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు..

మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు. ఆమె ఓఎస్డీ సుమంత్ పై ప్రభుత్వం నిన్న వేటు వేసింది. అయితే అతను మంత్రి ఇంట్లో ఉన్నాడనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో వారు మంత్రి ఇంటికి చేరుకున్నారు. అయితే కొండా సురేఖ కూతురు సుస్మిత పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుమంత్ కోసం వస్తే…మఫ్టీలో ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. ఏ కారణం మీద అన్ని అరెస్ట్ చేయబోతున్నారు? అంటూ పోలీసులకు ఆమె ప్రశ్నల వర్షం కురింపించారు. ఇదంతా తన తండ్రిని ఇరికించేందుకు జరుగుతున్న కుట్ర అని సుస్మిత ఆరోపిస్తున్నారు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం…

మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు

హైడ్రామా

ఆమె మాజీ ఓఎస్టీ సుమంత్ కోసం మంత్రి నివాసానికి వచ్చిన పోలీసులు వాగ్వాదానికి దిగిన సురేఖ కుమార్తె సుస్మిత తమ కుటుంబంపై సీఎం రేవంత్, పొంగులేటి, వేం నరేందర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు రెడ్లు అంతా కలిసి బీసీ మంత్రి అయిన తన తల్లిని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ సుమంత్ డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను రివాల్వర్తో బెదిరించారని ఆరోపణలు ఉత్తమ్ ఫిర్యాదు మేరకు పోలీసుల చర్యలు?..

మఫ్టీలో ఉన్న పోలీసుతో మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత..పోలీసులు ఎదురుగా ఒకే కారులో మంత్రి తో వెళ్లిపోయిన osd.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని గాయత్రి హిల్స్ లోని మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ పై కాంగ్రెస్ ప్రభుత్వం వేటు వేసింది. ఈ నేపథ్యంలో అతను సురేఖ ఇంట్లోనే ఉన్నాడనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇప్పటికే ఫిర్యాదులున్న సుమంత్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్ళారు. అయితే పోలీసులు మఫ్టీలో వెళ్ళడంతో…వారిని సురేఖ కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు. మఫ్టీలో ఎందుకు వచ్చారని…మీరెవరని ప్రశ్నలు అడిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము పోలీసులమని, సుమంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చామని చెప్పగా… ఆమె తాను ఇంట్లోకి అనుమతించనంటూ అడ్డుకున్నారు. ఈ లోపు మంత్రి సురేఖ, సమంత్ లో బయటకు వచ్చి పోలీసుల ఎదురుగానే ఒకే కారులో బయటకు వెళ్ళిపోయారు.

కాంగ్రెస్ పెద్దలు కావాలనే ఇదంతా చేస్తున్నారు..
కావాలనే తమ తల్లిదండ్రులపై కుట్రపన్నుతున్నారని మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత అంటున్నారు. కాంగ్రెస్ పెద్దలే ఇవన్నీ చేస్తున్నారంటూ ఆరోపించారు. బీసీలకు ప్రాధాన్యమివ్వాలని రాహుల్‌గాంధీ అంటుంటే.. పెద్దలు తమను తొక్కేస్తున్నారని అన్నారు. నిజానికి పోలీసులు సుమంత్ ను అరెస్ట్ చేయడానికి రాలేదని…అతనిని అడ్డుపెట్టుకుని మా అమ్మ సురేఖను అదుపులోకి తీసుకునేందుకు వచ్చారని సుస్మిత మీడియా ఎదుట ఆరోపించారు. తప్పులు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను వదిలేసి తమ మీద పడ్డారని అన్నారు. సుమంత్‌ను అదుపులోకి తీసుకుని కొండా మురళి చెబితేనే నేను బెదిరించానని ఆయనతో పోలీసులు తెల్లకాగితంపై రాయించి, ఆ తర్వాత మా నాన్నను అరెస్ట్‌ చేస్తారు. ఇప్పటికే మా నాన్నకు గన్‌మెన్‌ను తొలగించారు అంటూ సుస్మిత మండిపడ్డారు. వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఈ వ్యవహారం వెనుక ఉన్నారని అన్నారు…