ఐ బొమ్మ ఇమ్మిడి రవిని సోషల్ మీడియాలో హీరోగా వర్ణిస్తున్న నేటిజెన్లు..

ఐ బొమ్మ ఇమ్మిడి రవిని సోషల్ మీడియాలో హీరోగా వర్ణిస్తున్న నేటిజెన్లు..

పేదోళ్లు ఇంట్లో కూర్చొని దర్జాగా సినిమా చూస్తున్నారంటే దానికి కారణం ఐబొమ్మే అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు..

.

శనివారం (నవంబర్ 15) సైబర్ క్రైమ్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఓ ముఖ్యమైన పని నిమిత్తం రవి శుక్రవారం (నవంబర్ 14) ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడని, కూకట్ పల్లిలోని రెయిన్ విస్టా ప్లాట్లో ఉండగా పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి మరీ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో రవి నివాసం నివాసం నుంచి కీలకమైన హార్డ్ డిస్కులు, ల్యాప్ టాప్స్, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్ డీ ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐ-బొమ్మ వెబ్ సైట్ సర్వర్ నుంచి సమాచారం కూడా సేకరించారు. అప్ లోడ్ కు రెడీగా ఉన్న కొన్ని కొత్త సినిమాల హర్డ్ డిస్క్ లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక విచారణంలో భాగంగా రవి నుంచి పోలీసులు కీలక విషయాలను రాబట్టడం జరిగింది..

ప్రస్తుతం సినీ ఫీల్డ్ మొత్తం కూడా ఏకమై స్పందించిన ఏకైక సందర్భం ఏమైనా ఉంది అంటే అది కేవలం ఐ బొమ్మ ఇమ్మిడి రవిని అరెస్టు చేయడం మాత్రమే… ప్రతి హీరో కూడా స్పందించాడు.. ప్రతి డైరెక్టర్ కూడా స్పందించారు.. ప్రత్యక్షంగా కొందరు పరోక్షంగా కొందరు.. కానీ మీరు పెట్టిన ప్రెస్మీట్లోకి భిన్నమైన అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నట్లుగా కొంత అర్థమవుతుంది..

ప్రస్తుతం సగం వార్తలు ibomma పై నడుస్తుంది.. ఈ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అద్భుతం అందులో ఎటువంటి డౌటు లేదు…. ఒక సామాన్యుడు సైబర్ ద్వారా ఎన్నో లక్షలు పోగొట్టుకున్నారు వాటిపై ఇలానే స్పందించి న్యాయం చేస్తారా…!..
సరే అది పక్కకు పెట్టండి ఇప్పుడు నడుస్తున్న ట్రెండు మొత్తం కూడా సినిమా ibomma పై కాబట్టి ఒక సామాన్యుడికి ప్రస్తుతం సినిమా వెళ్లే ఛాన్స్ ఉందా… దానిపై ఎందుకు దృష్టి పెట్టలేదు…. వేలకోట్ల డబ్బు ఎవడు పెట్టమన్నాడు ఎందుకు సినిమా తీస్తున్నారు.. ఇది సామాన్యుల మధ్యలో మెదులుతున్న ఆలోచన.. తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తే ఇలా పైరసీ వెంట ఎవరు వెళ్ళరు కదా… ఓ మధ్యతరగతి వారు ఒక సినిమాకి వెళ్లి రావాలంటే మినిమం 3 వేల రూపాయలు అవుతుంది.. టికెట్ ధర ఒకటి అయితే అందులో కొనుగోలు మరి దారుణంగా పెరిగిపోయాయి.. ఖర్చు పెట్టాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తాం . అటువంటి సమయంలో ఇలాంటి పైరసీల వెంట పడుతూనే ఉంటారు… ముందు సామాన్యుడికి అందుబాటులో ఉండేలా టికెట్ ధర పెట్టండి… అప్పుడు పైరసీల వెంట ప్రజలు పడటం కూడా తగ్గుతారు అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు…..

బెనిఫిట్ షోలకి వేలకు వేలు తగలబెట్టి సినిమా ధియేటర్లకు వెళ్తున్నారు…. సినిమా బాగుంటే అది అలానే నడుస్తుంది… సినిమా బాగోకపోతే వెంటనే ott లోకి వస్తుంది… ఇది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అనుసరిస్తున్న తీరు….. ఒక ఐ బొమ్మ రవిని అరెస్టు చేస్తే , మరికొంతమంది కూడా ఇలా పుట్టుకొస్తూనే ఉంటారు.. శాశ్వత పరిష్కారం అది కాదు… సామాన్యుడికి సినిమా అందుబాటులోకి ఎప్పుడైతే వస్తుందో అలాంటి సమయంలోనే ఇలాంటి వాటి వెంటపడేందుకు అవకాశం తగ్గుతుంది….

సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీపై విమర్శలు...

వందల వేల కోట్లు పెట్టి సినిమా తీసి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు… సామాన్యుడికి ఎప్పుడైతే సినిమా చూసే అవకాశం దక్కుతుందో అప్పుడు మాత్రమే సినీ ఇండస్ట్రీపై అందరికీ అభిమానం పెరుగుతుందని అంటున్నారు…
మరికొందరు వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు.. డ్రగ్స్ కేసులో హీరోలు అంతా దొరికినప్పుడు అప్పుడు ఎందుకు ఇదే ఐక్యతతో వారందరినీ పక్కకు పెట్టలేదని.. వాళ్లందర్నీ శిక్షించాలని ఎందుకు తీర్మానించలేదంటూ విమర్శలు వెళ్ళు వెత్తుతున్నాయి….

50 రూపాయలకి టికెట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సామాన్యుడు సినిమా చూడటం జరుగుతుందన్నారు.. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ సినిమా ఇండస్ట్రీపై సానుభూతి చూపిస్తారంటూ కామెంట్స్ పెడుతున్నారు..

పోలీసులపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.. సినీ ఇండస్ట్రీకి 21 వేల కోట్లు లాస్ వచ్చిందంటూ దానికి కారకుడు ఇమిడి రవి అంటూ తేల్చడంతో.. సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా హ్యాపీగా ఉన్న మిగతావారు మాత్రం రవికి మద్దతుగానే మెసేజ్లు చేస్తున్నారు… సి పి సజ్జన్నార్ స్పందిస్తూ ఎవరైనా ఇమిడి రవిని హీరోని చేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు..