ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే వస్తున్నట్లయితే, దానికి వాస్తు శాస్త్రంలో ఒక కచ్చితమైన అర్థం ఉంది. సాధారణంగా పిచ్చుకలు పల్లెల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ పట్టణాల్లో కూడా పిచ్చుకలు ఇంటికి రావడం మనం గమనిస్తూ ఉంటాం. వాస్తు నిపుణుల ప్రకారం, పిచ్చుకలు ఇంటికి రావడం శుభ సంకేతంగా భావిస్తారు. ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే వస్తున్నాయంటే, త్వరలో ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారని, రాజభోగాన్ని అనుభవించబోతున్నారని అర్థం. పూర్వకాలం నుండి పిచ్చుకలు ఇంట్లోకి రావడాన్ని శుభ సూచకంగానే భావించారు. జంట పిచ్చుకలు ఇంట్లోకి వస్తే, అతి త్వరలో ఇంట్లో కళ్యాణం జరగబోతుందని లేదా సంతానం కలగబోతుందని అర్థం. కాబట్టి, పిచ్చుకలు ఇంట్లోకి వచ్చినా, గూడు కట్టుకున్నా అది చాలా వరకు శుభమే. వాటిని తరమడానికి, కొట్టడానికి లేదా చంపడానికి ప్రయత్నించకూడదు. ఒకవేళ వాటిని బయటికి పంపించాలంటే, ఇంటి తలుపులు తెరిచి ఉంచడం ద్వారా అవి వాటంతట అవే వెళ్లిపోతాయి. వాటికి ఆహారం, నీళ్లు అందించడం వల్ల మరింత మంచి జరుగుతుంది..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.