సైనికుడి భౌతికకాయంతో వెళ్తున్న అంబులెన్స్‌కు ఉత్తరప్రదేశ్‌లో ప్రమాదం, ఆయన కొడుకు సహా నలుగురి మృతి..!

సైనికుడి భౌతికకాయంతో వెళ్తున్న అంబులెన్స్‌కు ఉత్తరప్రదేశ్‌లో ప్రమాదం, ఆయన కొడుకు సహా నలుగురి మృతి..

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ జిల్లాలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై నిలిపి ఉంచిన ట్రక్కును అంబులెన్స్ ఢీకొట్టడంతో నలుగురు మరణించారు. కిడ్నీ వ్యాధితో చండీగఢ్ చికిత్స పొందుతూ మరణించిన సుబేదార్ మేజర్ సత్యవాన్ సింగ్ మృతదేహాన్ని ఈ అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఇది జరిగింది. ఈ ప్రమాదంలో సత్యవాన్ సింగ్ కొడుకు గౌరవ్, సోదరుడు రామ్ సముజ్, బంధువు రాజన్, అంబులెన్స్ డ్రైవర్ జస్పాల్ ప్రాణాలు కోల్పోయారు.