తెలంగాణ ఉద్యమకారులకు అండగా నిలుస్తూ, వారికి ఆపన్నహస్తం అందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి ఉదారత చాటుకున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి ఆయన భారీగా ఆర్ధిక సాయం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో అనారోగ్యంతో కన్నుమూసిన ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ (Eduru Janardhan) ఫ్యామిలీకి రూ.10 లక్షలు అందించి అండగా నిలిచారు కేటీఆర్..తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న వేళ మేమున్నామంటూ బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తోంది. ఇటీవల అనారోగ్యం మరణించిన ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భరోసా ఇచ్చారు. అతడి ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేయించిన కేటీఆర్.., కుటుంబానికి రూ.లక్ష తక్షణ ఆర్థిక సహాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు బీఆర్ఎస్ మహిళా నేతలు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. శనివారం జనార్థన్ కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పిన వారిలో మాజీ మంత్రి, మాజీ ఎంపీ మాలోతు కవిత, తదితరుల ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.