విద్యుత్ ఉత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం బొగ్గులు కొనే పరిస్థితి కూడా లేదు…మాజీ ఎమ్మెల్యే నోముల భగత్..
నల్గొండ జిల్లా
హాలియా పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్, రాష్ట్ర నాయకులు రిక్కల ఇంద్రసేనారెడ్డి, బాబురావు నాయక్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మొత్తం అవినీతిమయంగా మారిందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు..
2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రంలో 7778 మెగా విద్యుత్ ఉత్పత్తి ఉంటే కెసిఆర్ ముఖ్యమంత్రి బాధ్యతలనుంచి దిగిపోయే నాటికి 24 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి తీసుకురావడం జరిగిందని తెలిపారు.
నాడు కెసిఆర్ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయానికి పరిశ్రమలకు గృహ అవసరాలకు 24 గంటల పాటు కరెంటు సరపరా ఉండేదని తెలిపారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయిందని వ్యవసాయానికి ఐదు గంటల కరెంటు కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. గృహ అవసరాలు పరిశ్రమలకు సైతం ప్రభుత్వం విద్యుత్ సరఫరాలలో కోతలు విధిస్తుందన్నారు.
దామచర్ల వద్ద 4000 మెగావాట్లతో గత కెసిఆర్ ప్రభుత్వం యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 400 మెగావాట్ల విద్యుత్తు కూడా ఉత్పత్తి చేయలేక పోతుంది అన్నారు.
విద్యుత్ ఉత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం బొగ్గులు కొనే పరిస్థితి కూడా లేదని విమర్శించారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో సింగరేణిలో పదివేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు.
కెసిఆర్ పాలనలో బొగ్గు కొరత లేదు, కరెంటు కొరతలేదు నీళ్ల కొరత లేదు పదేళ్లు బ్రహ్మాండంగా నడిచిన సింగరేణి ఇప్పుడు ఈ దుస్థితిలో ఉండడానికి కారణం ఎవరో ప్రజలు ఆలోచించాలి అని కోరారు..