మృత్యువుకు ఎంత దగ్గరగా వచ్చాం? మానవాళి గ్రహించుట.లేదు..

మృత్యువుకు ఎంత దగ్గరగా వచ్చాం?
మానవాళి గ్రహించుట.లేదు..

జనాభా వేగంగా పెరుగుతుంది. కానీ ఆహార ఉత్పత్తి అంతే వేగంగా పెరగదు. ఒక దశకు చేరుకున్న తర్వాత ప్రకృతి స్వయంగా ఆ పెరుగుదలకు అడ్డుకట్ట వేస్తుంది. కరువు, వ్యాధులు, యుద్ధాలు, మరణాలు… ఇవన్నీ జనాభాను మళ్లీ ఒక స్థాయికి తీసుకువస్తాయి.

ఎల్‌నినో కరువు కోరల్లోకి నెట్టింది. వర్షాభావం, ప్రాజెక్టుల్లో నీటి కొరతతో పంటలు ఎండిపోతున్నాయి. .

మానవ జాతి మనుగడ కోసమై ఉన్నఫళo గా
” *500″ కోట్ల చెట్లు* నాటవలసిన అవసరం ఉంది..

*”ఈ వేసవి మామూలు* *వేసవి కాదు..*

_హెచ్చరిక_ ”

ఈ రోజు బయట అడుగు పెడితే మాడిపోతున్నాం…

ఉదయం 9 గంటలకే రోడ్లు నిప్పులు కక్కుతున్నాయి…

ఫ్యాన్ గాలి చాలటం లేదు,

ఏసీ లేనిదే బతకలేం అనే స్థితికి వచ్చాం.

కానీ మనం ఎంతకాలం ఏసీలను ఆశ్రయిస్తాం?

నిప్పులు కక్కుతున్న నిజాలు:

1.ఉష్ణోగ్రత పెరుగుదల…

భారతదేశంలో 45°C సాధారణం అయిపోయింది…

రాజస్థాన్, విదర్భలో 49°C దాటుతోంది…

*56°C వద్ద మానవ మెదడు* పని చేయడం ఆగిపోతుంది..

*60°C కి చేరడానికి మనం* చాలా దగ్గిరగా ఉన్నాము.

*2.ఏసీ పరిష్కారం కాదు:

ఒక ఏసీ బయటకు వదిలే వేడి 10 చెట్లను నరికినంత ప్రభావం చూపుతుంది…

మనం చల్లదనం కోసం భూమిని ఇంకా వేడెక్కిస్తున్నాం…

*3.చెట్లు ఎక్కడ?.

భారతదేశానికి ఇప్పుడు తక్షణం 500 కోట్ల చెట్ల అవసరం ఉంది…

1970లో 40% ఉన్న అటవీ విస్తీర్ణం, ఇప్పుడు 21% కి పడిపోయింది.

మనం ఏం కోల్పోతున్నాం?

ఒక పెద్ద చెట్టు రోజుకు “4” మందికి సరిపడా ఆక్సిజన్ ఇస్తుంది. 20 ఏసీలకు సమానమైన చల్లదనాన్ని ఇస్తుంది…

భూగర్భ జలాలను పెంచుతుంది…

వర్షాలను ఆహ్వానిస్తుంది…

కానీ మనం అభివృద్ధి పేరుతో నిమిషానికి “15” చెట్లను నరుకుతున్నాం.

*ఇది ప్రభుత్వ బాధ్యత* *మాత్రమేనా?*

_కాదు_ .

*ప్రతి పౌరుడి బాధ్యత..

*సామాజిక భాద్యత ఎరిగిన,* *ప్రతి వ్యక్తి/* *వ్యక్తులు, సంస్థలు* *పూనుకోవాలీ …చెట్లు నాట* *డానికి .

ఒక చెట్టు పెరిగి నీడ ఇవ్వడానికి “5 నుండి 7 ఏళ్లు” పడుతుంది..

*అంటే మనం ఈ రోజు* *నాటితే, 2032లో ఫలితం* *చూస్తాం* .

ఇంకా ఆలస్యం చేస్తే, 60°C భూమిని మన పిల్లలకు అప్పగిస్తాం…

ఇప్పుడేం చేయాలి?

ప్రతీ మనిషి 2 రెండు (2) మొక్కలు చొప్పున నాటండి..

-మీ ఇంటి ముందు, స్కూల్లో, ఖాళీ స్థలంలో ఎక్కడైనా. వేప, రావి, మర్రి, చింత లాంటి దేశీయ చెట్లు నాటండి…

2.నాటిన మొక్కను చంపుకోకండి..
నీళ్లు పోయండి..
కంచె వేయండి.
అది బతికేలా చూడండి.
మనం మారకపోతే, ప్రకృతి మనల్ని మార్చేస్తుంది. ఆ మార్పు “మృత్యువు” రూపంలో ఉంటుంది లేదా చూడాల్సి వస్తుంది..

ఏసీ రిమోట్ పక్కన పెట్టి, ఒక పార పట్టుకోండి.

మీ పిల్లల ఊపిరి కోసం, ఈ భూమి కోసం ఈ రోజే ప్రతీ ఒక్కరు రెండేసి (2) చెట్లు చొప్పున నాటండి.

“ప్రతి ఇంటికి రెండు చెట్లు – ప్రాణం పోసే పని”

మనలను మనమే కాపాడుకొంటూ భావితరాలను కూడా కాపాడుకుందాము.