కిట్‌క్యాట్ చాక్లెట్లో పురుగులు కూకట్‌పల్లిలోని లులు మాల్లో కొనుగోలు చేసిన కిట్‌క్యాట్ చాక్లెట్లో పురుగులు కనిపించినట్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కస్టమర్..
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ప్రముఖ ‘లులూ మాల్’ (LuLu Mall)లో తీవ్ర నిర్లక్ష్యం బయటపడింది. పండుగ షాపింగ్ కోసం వచ్చిన ఓ కస్టమర్ కొనుగోలు చేసిన ప్రముఖ బ్రాండ్ కిట్‌క్యాట్ (KitKat) చాక్లెట్లో సజీవంగా పురుగులు కదులుతూ దర్శనమిచ్చాయి. చిన్నారుల కోసం కొన్న చాక్లెట్లో పురుగులు బయటపడటంతో సదరు కుటుంబం తీవ్ర భయాందోళనకు గురైంది.
https://x.com/TeluguScribe/status/2111094417478324497?s=20బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పండుగ సందర్భంగా కూకట్పల్లి లులూ మాల్‌కు వెళ్లిన ఓ కుటుంబం, అక్కడి సూపర్ మార్కెట్లో పిల్లల కోసం కిట్‌క్యాట్ చాక్లెట్లను కొనుగోలు చేసింది. అనంతరం ఇంటికి వెళ్లి పిల్లలకు ఇచ్చేందుకు చాక్లెట్ ప్యాకెట్‌ను ఓపెన్ చేయగా, అందులో పురుగులు పాకుతూ కనిపించాయి. పిల్లలు తినకముందే విషయాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని బాధితులు తెలిపారు. ఒకవేళ చిన్నారులు తెలియక వాటిని తిని ఉంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వినియోగదారుడు సంబంధిత చాక్లెట్ తయారీ సంస్థతో పాటు మాల్ ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. అంతర్జాతీయ స్థాయి బ్రాండ్‌గా పేరుగాంచిన లులూ మాల్ లాంటి పెద్ద రిటైల్ స్టోర్లలోనే కాలం చెల్లిన లేదా నిల్వ సరైన రీతిలో లేని నాసిరకం ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్నారా? అని నగరవాసులు మండిపడుతున్నారు. ఆహార భద్రతా ప్రమాణాలను గాలికొదిలేస్తున్న ఇలాంటి మాల్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు