దక్షిణ మండప నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం – తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి ..
– శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి జూకా సోలార్ పవర్ ప్లాంట్ యాజమాన్యం చేయూత,,
– దక్షిణ మండప నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం
– ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
– తీదేడు గ్రామ సర్పంచ్
చింతపల్లి………..
చింతపల్లి మండలం తీదేడు గ్రామంలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ దక్షిణ మండప నిర్మాణం కోసం జూకా సోలార్ పవర్ ప్లాంట్ యాజమాన్యం రూ.3,00,000 (మూడు లక్షల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి కి అందజేసిందన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి మాట్లాడుతూ…గ్రామంలోని దేవాలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు.
శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ దక్షిణ మండప నిర్మాణానికి రూ.3 లక్షల విరాళం అందించిన జూకా సోలార్ పవర్ ప్లాంట్ యాజమాన్యానికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి పనులను మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జూకా సోలార్ పవర్ ప్లాంట్ యాజమాన్యం ఏ.యస్.యం శ్రవణ్ కుమార్, హెచ్.ఆర్ నరేష్,తారక్,జానకిరామ్,పి.ఏ.సి.యస్ డైరెక్టర్ తిరుమణి పాపయ్య,మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమావత్ హానుమ నాయక్,మాజీ ఉప సర్పంచ్లు ఉలుపాల శేఖర్ రెడ్డి,సోనగంటి గోవర్ధనాచారి,గ్రామ వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి,గ్రామ పెద్దలు మర్రు రామారావు, ఉలుపాల పురుషోత్తం రెడ్డి, సిమర్ల శ్రీను యాదవ్,మర్రు శ్రీనివాస రావు,సిమర్ల ఆంజనేయులు, మునగాల అశోక్, తిరుమణి రవి తదితరులు పాల్గొన్నారు.