ఆదర్శ కుటుంబం కేవలం ఒక సాదాసీదా ఫ్యామిలీ స్టోరీ మాత్రమే కాదు. ప్రేక్షకుల ఊహలకు అందని విధంగా ఉంటుంది…విక్టరీ వెంకటేశ్.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేశ్ కాంబోలో రానున్న ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 30న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో మల్లారెడ్డి విశ్వ విద్యాలయ పీఠ్ కాలేజ్‌లో చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం హీరో వెంకటేశ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సుమారు రెండు దశాబ్దాల తర్వాత త్రివిక్రమ్, వెంకీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఆడియెన్స్‌లో ఇప్పటికే భారీ అంచనాలే ఉన్నాయి. దీనికితోడు వెంకటేశ్ తాజా వ్యాఖ్యలు వాటికి మరింత బలం చేకూర్చే విధంగా ఉన్నాయి..
ఆదర్శ కుటుంబం కేవలం ఒక సాదాసీదా ఫ్యామిలీ స్టోరీ మాత్రమే కాదు. ప్రేక్షకుల ఊహలకు అందని విధంగా ఎన్నో సస్పెన్స్, యాక్షన్, క్రైమ్ ఎలిమెంట్స్‌తో కూడి ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. త్రివిక్రమ్‌తో దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసి పనిచేయడం, ఒక సరికొత్త హై-ఎనర్జీ స్క్రిప్ట్‌తో రావడం చాలా సంతోషంగా ఉంది’ అని వెంకటేశ్ అన్నారు. అంతేకాకుండా విద్యార్థులను ఉద్దేశించి వెంకటేశ్ మాట్లాడుతూ తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. జీవితంలో కాలేజీ రోజులు చాలా మధుర జ్ఞాపకాలని, మళ్లీ తిరిగిరావని వెంకటేశ్ అన్నారు. ఈ సమయాన్ని బాగా ఎంజాయ్ చేయాలని, కానీ అదే సమయంలో తమ క్యారెక్టర్ కాపాడుకోవడం చాలా ముఖ్యమని విద్యార్థులకు మంచి మెసేజ్‌ను ఇచ్చారు.