తెలంగాణలోని రెండు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు రేపు సెలవు ప్రకటించారు. ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్ వర్ధంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే, రెసిడెన్షియల్ పాఠశాలలకు మాత్రం ఈ సెలవు వర్తించదని స్పష్టం చేశారు. కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోని విద్యార్థులకు సెలవు లభించనుంది. ఈ రెండు జిల్లాల పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు వర్తిస్తుంది. విద్యాసంస్థల యాజమాన్యాలు కలెక్టర్లు జారీ చేసిన ఆదేశాలను పాటించాలని అధికారులు సూచించారు..
నిజాం నిరంకుశ పాలనపై సింహంలా గర్జించిన మన్యం ముద్దుబిడ్డ కుమ్రం భీం త్యాగాలు తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవి. గిరిజన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఆ వీరుని వర్ధంతిని పురస్కరించుకుని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 26న విద్యాసంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు కళాశాలలకు సోమవారం ఈ సెలవు వర్తిస్తుందని జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆదివాసీల ఆరాధ్య దైవంగా భావించే ఆ గిరిజన బిడ్డను పండుగలా స్మరించుకోవడం ఇక్కడి ప్రతి ఒక్కరి కనీస బాధ్యత ..ఈ సెలవు ప్రకటనతో సోమవారం ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులకు విశ్రాంతి దొరకనుంది. అయితే ఈ సెలవు అమలు విషయంలో జిల్లా అధికారులు ఒక ముఖ్యమైన మినహాయింపును చాలా స్పష్టంగా పేర్కొన్నారు. జిల్లాలోని సాధారణ విద్యాసంస్థలకు మాత్రమే ఈ సెలవు వర్తిస్తుందని, రెసిడెన్షియల్ పాఠశాలలకు మాత్రం ఎలాంటి సెలవు ఉండబోదని తేల్చిచెప్పారు. రెసిడెన్షియల్ విద్యార్థులు యథావిధిగా సోమవారం కూడా తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ సెలవు ఇచ్చిన రోజుకు బదులుగా రాబోయే నవంబర్ 14ను పని దినంగా పరిగణించాలని అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి.