కేటీఆర్‌కు క్షమాపణ చెప్పిన ఈనాడు..
తప్పుడు వార్తకు పత్రిక చరిత్రలో మొదటిసారీ..
కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులకు ఈనాడు యాజమాన్యం స్పందించింది..
కేటీఆర్ పాస్‌పోర్టుపై వార్త ప్రచురించామని క్షమాపణలు కోరిన ఈనాడు..!.
చరిత్రలో మొదటిసారిగా తప్పుడు వార్త ప్రచురించినందుకు క్షమాపణలు..కేటీఆర్ లీగల్ నోటీసులకు తలొగ్గిన ఈనాడు యాజమాన్యం
ఏసీబీ కోర్టు తన పాస్‌పోర్ట్ సీజ్ చేయమని ఆదేశాలు ఇవ్వకున్నా, ఇచ్చినట్లు ఈనాడు దినపత్రిక తప్పుడు కథనం
తప్పుడు వార్త ప్రచురించినందుకు లీగల్ నోటీసులు పంపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
దీంతో కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణలు చెబుతూ, డిజిటల్ మాధ్యమాలలో సహా అన్ని చోట్లా ఈ వార్తను తొలగిస్తున్నామని తమ లాయర్ ద్వారా బదులిచ్చిన ఈనాడు దినపత్రిక…
ఈ మేరకు తన న్యాయవాది ద్వారా వివరణ ఇచ్చింది. కేటీఆర్ పాస్‌పోర్టును సీజ్ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వకపోయినప్పటికీ, ఇచ్చినట్టుగా ఈనాడు దినపత్రిక ఇటీవల తప్పుడు కథనం ప్రచురించింది. దీనిపై కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో దిగొచ్చిన ఈనా డు యాజమాన్యం.. కేటీఆర్ పాస్‌పోర్టు వ్యవహారంలో తమ పత్రికలో తప్పుడు వార్తను ప్రచురించినట్టు అంగీకరించింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదని, పొరపాటున తప్పు జరిగిందంటూ పశ్చాత్తాపం వ్యక్తంచేసింది. తప్పుడు వార్త ప్రచురించినందుకు క్షమాపణలు కోరింది. ఇక ఈ వ్యవహారాన్ని ముగించాలని కేటీఆర్ తరపు న్యాయవాదిని కోరింది.
కేటీఆర్ పాస్‌పోర్టుల విషయంలో తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏసీబీ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన మెమోను తప్పుగా అర్థం చేసుకొని, కేటీఆర్ పాస్‌పోర్టును తాతాలికంగా జప్తు చేయాలని కోర్టు ఆదేశించినట్టుగా వార్త ప్రచురించడం పొరపాటేనని అంగీకరించింది. ఈ వ్యవహారంపై కేటీఆర్ తరఫు న్యాయవాది ఎన్ లలితారెడ్డి సెప్టెంబర్ 30న పంపిన లీగల్ నోటీసుకు.. ఈనాడు సంస్థ తరఫు న్యాయవాది జీవీఎస్ జగన్నాథరావు అక్టోబర్ 13న సమాధానం ఇచ్చారు.
సెప్టెంబర్ 29న ఈనాడు హైదరాబాద్ ఎడిషన్‌లో ప్రచురితమైన వార్తలో ఏసీబీ దాఖలు చేసిన మెమోలోని అంశాలను తప్పుగా పేరొన్నట్టు ఆ సమాధానంలో వివరించారు. పాస్‌పోర్టులను తాతాలికంగా జప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా వార్తలో రాయడం పొరపాటని సంస్థ తరఫున అంగీకారం తెలిపారు. పాస్‌పోర్టుల విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని ఏసీబీ కోరిందని, ఈ మేరకు దాఖలు చేసిన మెమోలోని అంశాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే వార్తలో పొరపాటు చోటుచేసుకున్నదని వివరణ ఇచ్చారు. వాస్తవానికి పాస్‌పోర్ట్ స్వాధీనం కోసం ఏసీబీ దాఖలు చేసిన మెమో ఆధారంగా కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు..
డు ప్రచురించిన వార్తలో జరిగిన పొరపాటు ఉద్దేశపూర్వకమైనది కాదని, అది నిజమైన పొరపాటేనని, ఇందుకు తీవ్రంగా విచారం వ్యక్తంచేస్తున్నామని ఈనాడు తరఫు న్యాయవాది తెలిపారు. ఈ విషయంపై అక్టోబర్ 7న ఈనాడు ఎడిషన్‌లో వివరణ ప్రచురించి, పొరపాటును సరిదిద్దామని పేరొన్నారు. కేటీఆర్ తరఫున న్యాయవాది లలితారెడ్డి పంపిన నోటీసులో చేసిన డిమాండ్‌ను కూడా నెరవేర్చామని తెలిపారు.
ఆ నోటీసు అందిన వెంటనే ఈనాడు డిజిటల్, సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచురితమైన సంబంధిత కథనాలన్నింటినీ తొలగించామని వెల్లడించారు. వార్తలో జరిగిన తప్పును సరిదిద్దుతూ అక్టోబర్ 7న ఈనాడు వివరణ ప్రచురించిందని న్యాయవాది తన సమాధానంలో పేరొన్నారు. ఈ పొరపాటు ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదని, అనుకోకుండా జరిగిందని, ఇందుకు తీవ్ర విచారం వ్యక్తంచేస్తున్నామని వివరించారు. పొరపాటు జరిగిందని వివరణ ప్రచురించడం, సంబంధిత డిజిటల్ కథనాలను తొలగించడం వంటి చర్యలను ప్రస్తావిస్తూ, ఈ అంశంపై తదుపరి చర్యలు తీసుకోకుండా చూడాలని ఈనాడు సంస్థ తరఫు న్యాయవాది కోరారు…
వందసార్లు ఆలోచించి రాసే ఈనాడు పేపర్ ఇలా చేయడం పట్ల పలువురు ఆ పత్రిక పై ఉన్న గౌరవాన్ని దిగజార్చుకుంటుందంటూ కామెంట్స్ పెడు…