అధికార పార్టీ కాంగ్రెస్‌కు, ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌కు గట్టి ఎదురుదెబ్బ..!

అధికార పార్టీ కాంగ్రెస్‌కు, ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసింది…అక్టోబర్ 23న జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లోని నాలుగు స్థానాలనూ కూటమి కైవసం చేసుకుంది. ఎన్డీఏ తరఫున ముగ్గురు బీజేపీ అభ్యర్థులు, ఒక జేడీ(ఎస్) అభ్యర్థి బరిలోకి దిగారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్నికూడా కోల్పోయింది. మంగళవారం ఎన్నికల ఫలితాల్లో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పుట్టన్నను బిజెపి-జేడీ(ఎస్) కూటమి ఉమ్మడి అభ్యర్థి ఏపీ రంగనాథ్ ఓడించాడు. దీంతో బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గం స్థానాన్ని ఎన్డియే కూటమి కైవసం చేసుకుంది. రంగనాథ్ 10,810 ఓట్లు సాధించగా.. పుట్టన్నకు వచ్చిన 9,902 ఓట్లు వచ్చాయి. దీంతో 908 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు..