కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని ప్రశ్నించిన దివ్యాంగుడు…!!

కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని ప్రశ్నించిన దివ్యాంగుడు…

6 వేల పెన్షన్ ఇస్తామన్నారు, ఇంకెప్పుడు ఇస్తారంటూ మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం లింగంపల్లిలో అనిరుధ్ రెడ్డిని నిలదీసిన దివ్యాంగుడు…
నా చేతిలో లేదు, రేవంత్ రెడ్డి చేతిలో ఉంది అంటూ తప్పించుకున్న ఎమ్మెల్యే..

మంగళవారం కార్యర్తల మీటింగ్ లో..

అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి సొంత ప్రభుత్వంపైనే అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పూర్తయిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందని మండిపడ్డారు. తన నియోజకవర్గానికి నిధులు విడుదల చేయకపోతే 30 వేల మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగడానికైనా సిద్ధమని ప్రకటించారు. మంత్రుల నియోజకవర్గాలకే బిల్లులు చెల్లిస్తారా? మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు…