బలూచిస్తాన్‌లోని సూరబ్, కలత్ మధ్య ప్రయాణిస్తున్న కలత్ ఖాన్ మీర్ సులేమాన్ దావూద్ జాన్ అహ్మద్జాయ్ కుమారుడు ప్రిన్స్ ముహమ్మద్ ఖాన్ అహ్మద్జాయ్ను, అతని ముగ్గురు అంగరక్షకులతో పాటు గుర్తు తెలియని దుండగులు అపహరించినట్లు మంగళవారం వర్గాలు తెలిపాయి.
యువరాజు అహ్మద్జాయ్ నిన్న రాత్రి ఖుజ్దార్ నుంచి కలత్ కు ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం.
ప్రయాణ సమయంలో సాయుధ దుండగులు అతని వాహనాన్ని అడ్డగించి, అతడిని, అతని ముగ్గురు భద్రతా సిబ్బందిని గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకువెళ్లారు..
పాకిస్తాన్ అల్లకల్లోల ప్రాంతమైన బలూచిస్థాన్‌లో కలాత్ సంస్థాన ప్రస్తుత ఖాన్ (రాజు) మీర్ సులేమాన్ దావూద్ ఖాన్ కుమారుడు, బలూచ్ యువరాజు ప్రిన్స్ మొహమ్మద్ ఖాన్ అహ్మద్జాయ్ కిడ్నాప్ అయ్యారు…2026 అక్టోబర్ 26 (సోమవారం) రాత్రి ముగ్గురు గన్ మెన్లతో సహా యువరాజును కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఖుజ్దార్ నుండి కలాత్ నగరానికి యువరాజు మొహమ్మద్ ఖాన్ అహ్మద్జాయ్ హైవేపై ప్రయాణిస్తుండగా, సూరాబ్, కలాత్ మధ్య ఆయుధాలు కలిగిన దుండగులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. యువరాజుతో పాటు ఆయనకు భద్రతగా ఉన్న ముగ్గురు బాడీగార్డులను కూడా దుండగులు గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు.
క్వెట్టా పోలీస్ ప్రధాన కార్యాలయం దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. అయితే, ఈ కిడ్నాప్‌నకు తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద లేదా తిరుగుబాటు సంస్థ ప్రకటించలేదు.
కలాత్ రాయల్ ఫ్యామిలీ గురించి:
చారిత్రాత్మకంగా పాకిస్తాన్ లోని బలూచిస్థాన్ ప్రాంతాన్ని ఏలిన రాజులను ఖాన్ ఆఫ్ కలాత్ అని పిలుస్తారు. ప్రస్తుత ఖాన్ మీర్ సులేమాన్ దావూద్ గత కొన్నేళ్లుగా లండన్ (UK) లో ప్రవాస జీవితం గడుపుతున్నారు. బలూచ్ ప్రజలలో ఈ రాజకుటుంబానికి ఎంతో గౌరవం, ప్రత్యేక గుర్తింపు ఉంది.
రాజీ కోసం వచ్చి:
లండన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న తన తండ్రితో విభేదించి, పాకిస్తాన్ ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకోవాలనే ఉద్దేశంతోనే యువరాజు మీర్ మొహమ్మద్ ఖాన్ అహ్మద్జాయ్ లండన్ వదిలి బలూచిస్థాన్‌కు తిరిగి వచ్చారు. తన తండ్రిలా పాకిస్తాన్‌ను వ్యతిరేకించకుండా, పాక్ ప్రభుత్వంతో కలిసి నడుస్తూ బలూచిస్థాన్‌లో శాంతిని నెలకొల్పాలనే రాజకీయ ఉద్దేశంతోనే ఆయన లండన్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ కిడ్నాప్ వెనుక బలూచ్ తిరుగుబాటు గ్రూపుల హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.