మూసీ బాధితులతో పబ్లిక్ హియరింగ్ అని చెప్పి ప్రైవేట్ హియరింగ్ పెట్టారు..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్..
మూసీ బాధితులతో పబ్లిక్ హియరింగ్ అని చెప్పి ప్రైవేట్ హియరింగ్ పెట్టారు..
భూసేకరణ చేసినప్పుడు పబ్లిక్ హియరింగ్ జరిపి ప్రజలు మాట్లాడేలా స్వేచ్ఛా వాతావరణాన్ని కల్పించాలి..
రేవంత్ రెడ్డి పిరికివాడు కాబట్టి మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేనని ముందే మమ్మల్ని అరెస్ట్ చేశాడు..
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పబ్లిక్ హియరింగ్కి పోవచ్చు కానీ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని రావొద్దని అంటున్నారు…
ఇదేం రాజ్యంరా నాయన..– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్..
ఈ రోజు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ చట్ట విరుద్ధమని ఎమ్మెల్సీ దాసోజు తెలిపారు. 7300 కోట్ల రూపాయల ఆసియా అభివృద్ధి బ్యాంకు ఋణంతో మూసీకి టెండర్లు పిలిచారు.. ఎల్నినో పరిస్థితులు భయంకరంగా ఉంటే దాన్ని పటించుకోకుండా మూసీ ప్రక్షాళన పేరిట లూటీ చేస్తున్నారు. ప్రజలు కరువుతో అల్లాడుతున్నారు. ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే.. ఇంకోడు చుట్ట కాల్చుకోవడానికి అగ్గి కోసం వెతికినట్టు ఉంది రేవంత్ తీరు అని ఎద్దేవా చేశారు. అన్నం పెట్టమంటే పెదవులకు లిప్స్టిక్ పూసినట్టు ఉంది.. ఇదే సౌదీలో అయితే రేవంత్ ఆయన మంత్రులను రాళ్లతో కొట్టి శిక్షించే వాళ్లన్నారు…ఆంధ్రకు నీళ్లు వదిలి చోద్యం చూశారు.. కరువును పట్టించుకోకుండా మూసీకి రంగులు వేస్తున్నాడు పెయింటర్ బాబు అని ఎమ్మెల్సీ దాసోజు ఎద్దేవా చేశారు. రూ.7300 కోట్ల టెండర్లలో 30 శాతం కమిషన్ దొబ్బాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు.. ఆర్ఆర్ ట్యాక్స్ అని మోదీ ఇది వరకే చెప్పాడు ఆదానీ, మేఘా లాంటి సంస్థలకు మూసీ టెండర్లు దక్కేలా రేవంత్ ప్రయత్నిస్తున్నాడు. కరువులో కూడా రేవంత్ ఇంత అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పేదల మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు లాక్కోవడం సబబా.. ?..డీ పీ ఆర్ లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ జరగడం రేవంత్ సొంత ఇంటి వ్యవహారమా.. ? తాగడానికి నీళ్లు లేవు కానీ మూసీలో మల్లన్న సాగర్ నీళ్లు తెచ్చి పోస్తాడట. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు గురించి ఎవరికీ తెలియదు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు అమరావతి నుంచి వచ్చింది. అమరావతికి గ్రాఫిక్స్ తయారు చేసిన మెయిన్ హార్ట్ సంస్థ కే మూవీసీ డిజైన్లు అప్పగించారు.. అప్పనంగా రాష్ట్ర సంపద దోచి పెట్టడానికి రేవంత్ తాత జాగీరా.. అని ఫైర్ అయ్యారు.
వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆస్తులను కొల్లగొట్టేందుకు కూడా రేవంత్ స్కెచ్ వేశారని ఎమ్మెల్సీ దాసోజు పేర్కొన్నారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా రేవంత్ దోపిడీని బీఆర్ఎస్ అడ్డుకుంటూనే ఉంటుంది. మూసీ ప్రాజెక్టులో పేదల ఇండ్లు నష్టపోకుండా ఎంతటి పోరాటానికైనా సిద్దమన్నారు. రాష్ట్రప్రభుత్వం ఇపుడు కరువు పరిస్థితులను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాలన్నారు.