ఇది ఎల్ నినో తెచ్చిన కరువు కాదు..కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు, రేవంత్ రెడ్డి మనపై రుద్దిన కరువు.. కేటీఆర్..!
ఇది ఎల్ నినో తెచ్చిన కరువు కాదు..కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు, రేవంత్ రెడ్డి మనపై రుద్దిన కరువు!
బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఎల్ నినో వస్తుందని, నీళ్లను ఎత్తిపోయాలని హెచ్చరించిన ఇంజనీర్లకు కాదు రేవంత్..
నీళ్లను ఎత్తిపోయకుండా, కరువుకు కారణమైన నీకే ఇవ్వాలి!
ప్రజాకవి గూడ అంజయ్య గారు చెప్పినట్లుగా..
ఎత్తుకుందాం తెలంగాణ జెండా..
ఎగరేద్దాం గులాబీ జెండా గుండెల నిండా..
మళ్లీ రైతుబంధు కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం!
ఆదిలాబాద్ రైతు గర్జన సభలో వేలాది మంది రైతుల సమక్షంలో ప్రసంగించాను…
రైతులు ఎదుర్కొంటున్న కరువు పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్లో పెట్టిన మూడు విడతల రైతుబంధుతో పాటు యాసంగి పంటకు సంబంధించిన మరో విడతను కూడా కలిపి ఎకరానికి మొత్తం రూ.60 వేల చొప్పున చెల్లించాలని కోరారు. రైతుల పట్ల ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే ఈ మొత్తాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని అన్నారు.
కాళేశ్వరం నీటిని వినియోగించకపోవడం, సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేయకపోవడం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్నది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
కౌలు రైతులకు కూడా రైతులతో సమానంగా రైతుబంధు సాయం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 21 లక్షల మంది కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎగ్గొట్టిన మూడు విడతల రైతుబంధుతో పాటు యాసంగి పంటకు సంబంధించిన మరో విడతను కలిపి మొత్తం నాలుగు పంటలకు ఎకరానికి రూ.60 వేల చొప్పున వెంటనే చెల్లించాలని కోరారు. అలాగే భూమిలేని నిరుపేద రైతు కూలీలకు 36 నెలల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బకాయిలు రూ.36 వేలు వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
కౌలు రైతు అంటే ఎవరో తెలుసా? భూమి లేని వ్యక్తి లేదా తక్కువ భూమి ఉండి పక్కవారి భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకునే వ్యక్తి. అలాంటి కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇస్తామని రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని 21 లక్షల మంది కౌలు రైతులకు ప్రేమలేఖలు రాసి, తనకు ఓటు వేస్తే రైతుబంధు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ మాటలు నమ్మి కౌలు రైతులు కాంగ్రెస్కు ఓటు వేశారు. ఇప్పుడు ఆ హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు.
రైతులతో సమానంగా కౌలు రైతులకు కూడా రైతుబంధు చెల్లించాలని రాష్ట్రంలోని కౌలు రైతుల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎగ్గొట్టిన మూడు విడతలతో పాటు యాసంగి పంటకు సంబంధించిన మరో విడతను కలిపి నాలుగు పంటలకు ఎకరానికి రూ.60 వేల చొప్పున వెంటనే ఖాతాల్లో జమ చేయాలని అన్నారు.
భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. నెలకు రూ.1,000 చొప్పున ఇస్తామని చెప్పి 36 నెలలు గడిచినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. నెలకు వెయ్యి రూపాయల చొప్పున 36 నెలలకు కలిపి ఒక్కో రైతు కూలీకి రూ.36 వేలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. “36 నెలలు అయిపోయాయి. మరి 36 నెలలకు గాను మీ అందరి చప్పట్ల మధ్యన నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.. వెంటనే రూ.36 వేలు మా రైతు కూలీల ఖాతాల్లో డిపాజిట్ చేయాలి” అని కేటీఆర్ అన్నారు…