బెంగళూరు – ముంబై నగరాల మధ్య రాత్రిపూట ప్రయాణాన్ని మరింత సులభతరం…వందే భారత్ స్లీపర్ రైలు…!

బెంగళూరు – ముంబై నగరాల మధ్య రాత్రిపూట ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే ఈ సరికొత్త రైలును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. 16 కోచ్‌‌‌‌‌‌‌‌లతో కూడిన ఈ తొలి వందే భారత్ స్లీపర్ రైలు బెంగళూరులోని సర్ ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్ (ఎస్ఎమ్ వీటీ) నుంచి బయల్దేరింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హెచ్‌‌‌‌‌‌‌‌డీ కుమారస్వామి, సహాయ మంత్రులు వి.సోమన్న, శోభా కరంద్లాజే, ఎంపీలు తేజస్విసూర్య, పీసీ మోహన్, సీఎన్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు..రైలు రాకపోకల వివరాలు..
ఈ రైలు సాధారణ రాకపోకలు ముంబై–బెంగళూరు మార్గంలో నవంబర్ 2 నుంచి, బెంగళూరు-–ముంబై మార్గంలో నవంబర్ 3 నుంచి ప్రారంభంకానున్నాయి. బెంగళూరు నుంచి ముంబైకి వెళ్లే రైలు సోమవారం మినహా, ముంబై నుంచి బెంగళూరు వచ్చే తిరుగు ప్రయాణ రైలు మంగళవారం మినహా వారంలో 6 రోజులు సేవలు అందిస్తాయి. ఇదిలా ఉంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కూడా రైల్వే శాఖ మరో కానుకను అందించింది. వారణాసి – న్యూఢిల్లీ మధ్య దేశంలోనే సరికొత్త వందే భారత్ స్లీపర్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు..