తీరం దాటిన మురసు తీవ్ర తుఫాను..!

మరో ముప్పు ముంచుకొచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తీవ్ర తుపానుగా మారి.. విధ్వంసం సృష్టించింది…మురసు తీవ్ర తుఫాను నెల్లూరు- నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటింది. తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య తుపాను తీరం దాటిందని ఎస్డీఎంఏ-ఎండీ, ఆర్టీజీఎస్- సీఈఓ ప్రఖర్ జైన్ తెలిపారు. అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.. ఏదైనా సమస్య ఎదురైనా, ఏ సమయమైనా 9552300009 మన మిత్ర ద్వారా తెలియజేయాలని ప్రభుత్వం సూచనలు చేసింది.. తీరం దాటినప్పటికి భారీ వర్షాలు కురుస్తాయని.. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. తుపాను ప్రభావంతో 100-120కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారింది. మురసు ఎఫెక్ట్‌తో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. 50 మీటర్లు ముందుకు వచ్చింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు…
తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణాతోపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. ఇప్పటికే ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి…