ఆంధ్రప్రదేశ్ లో రేపు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్..!
*ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం.
*13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీల్లో కౌంటింగ్.
*6,831 టేబుళ్లు.. 47,817 మంది సిబ్బందితో లెక్కింపు…
ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో.. కీలక దశకు కౌంట్‌డౌన్ స్టార్టయ్యింది. బ్యాలెట్లలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం గంటల వ్యవధిలో తేలిపోనుంది. రీపోలింగ్ సెంటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన పురపోరుకు సంబంధించిన ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మరోవైపు కౌంటింగ్ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని.. అటు అధికార కూటమి, ఇటు విపక్షం.. తమ నేతలను, శ్రేణులను అలెర్ట్ చేశాయి..
92 పురపాలికల్లో పోలింగ్ జరగగా.. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 138 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో 556 కౌంటింగ్ హాల్స్.. 6 వేల 831 కౌంటింగ్ టేబుల్స్‌ను సిద్ధం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు 6 వేల 831 మంది సూపర్వైజర్లు ఉంటారు. కౌంటింగ్ కోసం 13వేల 662 మంది సిబ్బంది ఉంటారు. ఓట్ల లెక్కింపులో 27 వేల 324 మంది అసిస్టెంట్లు పాల్గొంటారు…
సంస్థలు/నగర పంచాయతీలు) ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 మున్సిపల్ ఛైర్మన్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 13 మేయర్, 70 మున్సిపల్ ఛైర్మన్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బరిలో 153 మంది మేయర్ అభ్యర్థులు, 367 మంది మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 3,942 వార్డు స్థానాలకు గానూ 755 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. పోలింగ్ జరగనున్న 3,186 వార్డుల్లో 9,742 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం ఓటర్ల సంఖ్య 99.36 లక్షలు ఉండగా.. వీరిలో మహిళా ఓటర్ల సంఖ్యే అత్యధికం (51.05 లక్షలు), పురుష ఓటర్లు 48.29 లక్షలు ఉన్నారు.
రీపోలింగ్ ప్రకటించిన 13 కేంద్రాల్లోనూ ఆ ప్రక్రియ పూర్తయిపోవడంతో వాటిలో కూడా కౌంటింగ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే కౌంటింగ్ సెంటర్లలో దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా. ఈప్రక్రియ కోసం 556 హాళ్లు, 6,831 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌లో మొత్తం 47వేల 817 మంది సిబ్బంది పాల్గొననున్నారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిల్లో కలిపి మొత్తం 2,805 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేసిన అధికారులు. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు…