ఎమ్మెల్సీ ఎలక్షన్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..

ఎమ్మెల్సీ ఎలక్షన్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం..

*తెలంగాణకు సాగునీరు అందించకుండా ఆంధ్రకు నీళ్లు తరలించిన కాంగ్రెస్ ప్రభుత్వం..*

*అన్ని రంగాల ప్రజలను మోసం చేసి గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ .. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి* .

*సూర్యాపేట జిల్లా…..

ఉమ్మడి నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు సమీక్షా సమావేశం..

ముఖ్య అతిథులుగా హాజరు అయిన మాజీ మంత్రి సూర్యాపేట MLA గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి…ఎమ్మెల్సీ ఓటర్ నమోదు హుజూర్నగర్ ఇన్చార్జి కంచర్ల కృష్ణారెడ్డి..
బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి..బిఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి..

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ….

ఎమ్మెల్సీ ఎలక్షన్లో బిఆర్ఎస్ జండా విజయకేతనం ఎగరడం ఖాయం….

ఏం మొఖం పెట్టుకొని కాంగ్రెస్ వారు ఓటేయమని అడుగుతారు..

జనాల్లోకి వెళ్లలేక ముఖం చాటు వేసిన కాంగ్రెస్ నాయకులు..

కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువచ్చింది.. కృష్ణమ్మని వాడుకోవడం చేతకాక చంద్రబాబు నియోజకవర్గానికి పంపించిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతోంది…
కనీసం నీటిపై అవగాహన లేని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి…

కాలేశ్వరం ప్రాజెక్టుపై అవాకులు చవాకులు మాట్లాడుతూ అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు…..
కెసిఆర్ ఉన్నప్పుడు పచ్చగా ఉన్న పల్లె సీమలు నేడు నెర్రెలవాసి, ఆకాశం వైపు చూస్తున్నాయని అన్నారు..
ఇవేం పట్టని కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ చుట్టూ చెక్కర్ల కొడుతున్నారని అన్నారు…..

గతంలో కాంగ్రెస్ పాలన వస్తే మార్పు వస్తుంది అని అందరూ ఏదో గొప్పగా జరుగుతోందని ఆశపడ్డారు…. కానీ రైతుల జీవితాలు నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటాడుకుందని.. అందర్నీ నడిరోడ్డుపై పడేసిందని ఆరోపించారు…… హుజూర్నగర్ నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతుందని అందుకు నిదర్శనమే ఇటీవల అధికారుల సస్పెండ్ చేయడమని అన్నారు…. పాలనపై చేతకాకుండా ల్యాండ్ స్టాండ్ మెయిన్స్ పై దృష్టి పెడుతున్నారని అన్నారు…..

*బిఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ..

ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లో బిఆర్ఎస్ ప్రభంజనం సృష్టించడం ఖాయం…..

అరచేయి అడ్డుపెడితే తొక్కించుకొని పోవడం ఖాయం….
అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి రాజ్యమేలుతోంది….. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంతో దగాపడ్డారు…… గతంలోనే కొద్దిపాటి తేడాతో ఒక్క అడుగు వెనక్కి వేయడం జరిగిందని అన్నారు…… ఈసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని అన్నారు…… ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుల పనిచేస్తూ బిఆర్ఎస్ పార్టీ గెలుపుకి కృషి చేయాలని పిలుపునిచ్చారు…

*సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ..

అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదని అన్నారు…. అత్యధికంగా ఈసారి ఉత్తంకుమార్ రెడ్డి నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీకి ఓటు నమోదు అవుతుందని అన్నారు…. నియోజకవర్గంలోని బిఆర్ఎస్ శ్రేణులను ఎంత ఇబ్బంది పెట్టినా సైనికుల పోరాడుతున్నారని అన్నారు…. ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించి పెద్ద ఎత్తున నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం బిఆర్ఎస్ పార్టీ విజయమైన అని అన్నారు….. కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అన్నిటిని తుంగలో తొక్కుకుంటూ తెలంగాణ రైతాంగాన్ని మొత్తాన్ని కూడా ఆగం చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు…. హుజూర్నగర్ నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతుందని అన్నారు… అధికారులను సస్పెండ్ చేసి అందుకు ప్రలోభ పెట్టిన అధికార పార్టీ నాయకుల్ని ఎవర్ని ఏమనకపోవడం వెనక మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని అన్నారు…