అడవులు నరికే వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది.. కకేటీఆర్…కేటీఆర్ సెటైర్లు

అడవులు నరికే వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో..

భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది.. కకేటీఆర్…కేటీఆర్ సెటైర్లు..

మియాపూర్ భూములను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కబ్జా పెడితే ప్రముఖ న్యాయవాదిని పెట్టి కేసు వాదించాము

ఇటీవల సుప్రీంకోర్టు ఆ భూమి ప్రభుత్వానిది అని తీర్పు ఇచ్చింది

తీర్పు వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ భూములు అమ్మేస్తున్నా అని చెప్తున్నాడు..కేటీఆర్..

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ‘బ్లాక్‌మెయిలర్ ఇప్పుడు ఏకంగా సీఎం అయ్యాడు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నేరపూరిత మనస్తత్వంతో ఒక ముఠాను ఏర్పాటు చేశారని, ఆ ముఠా కనుసన్నల్లోనే 22ఏ దందా నడుస్తోందని ఆరోపించారు. ప్రతి స్కీం వెనుక ఒక స్కాం ఉంటుందని కేటీఆర్ ఆరోపించారు. గుడి, బడి, ఆస్పత్రి, స్మశానం నిర్మించాలంటే ప్రభుత్వం దగ్గర గజం భూమి లేదని, కానీ హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాల భూములపై రేవంత్‌రెడ్డి కన్ను పడిందని అన్నారు….భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి త‌న అనుచ‌రుల‌తో క‌లిసి భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మియాపూర్ భూములను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కబ్జా పెడితే బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్రముఖ న్యాయవాది వైద్య‌నాథ‌న్ పెట్టి 550 ఎక‌రాల భూమి కోసం కేసు వాదించి భూమిని కాపాడామన్నారు…ఆఘ‌మేఘాల మీద‌ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఆ భూములు అమ్మేస్తున్నా అని చెప్తున్నాడ‌ని విమ‌ర్శించారు. మూడేండ్ల‌లో హైద‌రాబాద్ న‌గ‌రంలో కాంగ్రెస్ ఒక్క నిర్మాణం అయినా చేపట్టిందా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ ల‌క్ష‌ల డ‌బుల్ బెడ్ ఇండ్లు నిర్మించార‌ని గుర్తు చేశారు…