Ee Nagaraniki Emaindi..విశ్వక్సేన్ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతోన్న సినిమా ‘ఈఎన్ఈ రిపీట్’. అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడులైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా రిలీజైన ట్రైలర్ మరిన్ని అంచనాలు పెంచేసింది…మొదటి భాగంలో అలరించిన గ్యాంగ్ మళ్లీ తెరపై సందడి చేయబోతుండటంతో ప్రేక్షకులు మరియు సినీ అభిమానులలో ఈ ప్రాజెక్ట్ పై విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సీక్వెల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను మరియు శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. మిత్రుల మధ్య సాగే వినోదం, హంగామా మరియు ఊహించని ట్విస్టులతో కథ సాగనుందని సమాచారం. ఇక ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా రేపు రాబోతున్న ట్రైలర్ పూర్తిస్థాయిలో నవ్వులు పూయించేలా డిజైన్ చేసినట్లు చిత్రవర్గాలు తెలుపుతున్నాయి.
ప్రమోషన్స్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్న మేకర్స్, రానున్న రోజుల్లో మ్యూజికల్ ప్రోమోలను కూడా ఒకదాని వెనుక ఒకటి విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉండబోతున్నాయని, ప్రతీ పాట కూడా యూత్‌ను ఆకట్టుకునేలా ప్రత్యేకంగా కంపోజ్ చేశారని సినీ వర్గాలు వెల్లడించాయి. మొదటి భాగం ఫ్రెండ్షిప్ లవర్స్‌ను ఎంతగానో అలరించిన నేపథ్యంలో, ఈ రెండో భాగం కూడా థియేటర్లలో సరికొత్త మేజిక్ రీక్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈనెల 19న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాన్ని అందుకోనుందో చూడాల్సి ఉంది..
మొత్తానికి కథా నేపథ్యం నుంచి కామెడీ, ట్విస్టుల వరకు ప్రతి అంశం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. మరి ‘ఈ నగరానికి ఏమైంది’ మ్యాజిక్‌ను ఈ సీక్వెల్ మరోసారి రిపీట్ చేస్తుందా? అనేది తెలియాలంటే నవంబర్ 19 వరకు వేచి చూడాల్సిందే!