తెలంగాణలో వర్షాలు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్..!

తెలంగాణలో వర్షాలు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్..

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్

ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ వర్ష సూచన..

మహబూబాబాద్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం..

లోతట్టు ప్రాంతాలకు పొంచి ఉన్న వరద ముప్పు..

ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ఇప్పటికే తుఫాన్ ఎఫెక్ట్‌తో ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టించగా.. బంగాళాఖాతంలోని వాతావరణ మార్పుల కారణంగా ఈ రోజు కూడా ఏపీలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాకరం.. ఎన్టీఆర్‌ జిల్లాపై తుఫాన్‌ ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతోందని.. జిల్లా వ్యాప్తంగా ఈ రోజు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. దీంతో జిల్లా కలెక్టర్ విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు…

తెలంగాణలో వాతావరణం ఇలా

ఇక బంగాళాఖాతంలోని వాతావరణ మార్పుల కారణంగా ఇటు తెలంగాణలోనూ తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతవారణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మొస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.

తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు

హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర ప్రకారం.. ఈ రోజులు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో భారీ వరాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే ఆదిలాబాద్, కోమురంభం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరింనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని.. వర్షాల సమయంలో గంటలకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉంది అంచనా వేసింది..