చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు.. చికిత్స పొందుతూ కండక్టర్ మృతి…!
చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు..
చికిత్స పొందుతూ కండక్టర్ మృతి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద కొడుకుతో కలిసి భద్రాచలం వెళ్లే బస్సు ఎక్కిన అశ్వాపురం మండలం మిట్టగూడెంకు చెందిన మౌనిక అనే మహిళ..
కొడుకుకు టికెట్ ఇవ్వమని రూ. 100 ఇవ్వగా, రూ. 10 టికెట్ జారీ చేసి, మిగతా చిల్లరను టికెట్ వెనుక రాసిన కండక్టర్ ప్రవళిక..
తనకు చిల్లర ఇప్పుడే కావాలని కండక్టర్‌తో వాగ్వాదానికి దిగి, ఆమెను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన మౌనిక..
దీంతో బస్సు వెనుక టైర్ల కింద పడి ప్రవళిక రెండు కాళ్లు విరిగిన వైనం..
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన మహిళా కండక్టర్ ప్రవళిక…