ఆంధ్రాలో ఖాతా తెరవని కాంగ్రెస్. !..

ఏపీ వ్యాప్తంగా 3,942 వార్డులకు ఎన్నికల ఫలితాలు….

ఏపీ వ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా మున్సిపల్ కౌంటింగ్ కొనసాగుతోంది. మురసు తుఫాను ప్రభావంతో రెండు మూడు చోట్ల ఆలస్యంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. రాష్ట్రంలో మొత్తం 92 పురపాలికల్లో పోలింగ్‌ జరగగా… 138 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లేటెస్ట్ ట్రెండ్స్‌లో కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. సాయంత్రం వరకు పూర్తిగా ఫలితాలు
ఏపీ వ్యాప్తంగా 3,942 వార్డులకు ఎన్నికల ఫలితాలు..

మొత్తం 755 వార్డుల్లో ఏకగ్రీవంగా అభ్యర్థుల ఎన్నిక..

టీడీపీ 2,535, వైసీపీ 539 వార్డుల్లో విజయం
జనసేన 476, బీజేపీ 152 వార్డుల్లో విజయం-SEC
స్వతంత్ర అభ్యర్థులు 121 వార్డుల్లో విజయం..

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) కి మరోసారి తీరని దెబ్బ తగిలింది..ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం అయిన తరువాత పార్టీ పుంజుకుందని భావించిన ఆ పార్టీ నాయకులకు నిరాశే ఎదురయ్యింది..2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తరువాత 2014, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఏ ఒక్క సీటును దక్కించుకోలేక పోయింది. 2024..2026 ఎన్నికల్లో అవే ఫలితాలు రావడంతో కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్రస్థాయిలో పూర్తిగా నిరాశ చెందుతున్నారు…

మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. అధికారిక ప్రకటన చేసిన ఎస్‌ఈసీ..

13 నగరపాలక సంస్థలు (కార్పొరేషన్లు), 77 పురపాలక సంఘాలు (మున్సిపాలిటీలు), 10 నగర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు పూర్తయి ఎన్నికల ఫలితాలు స్పష్టమవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం (AP SEC) తదుపరి కీలక ఘట్టానికి సన్నాహాలు ప్రారంభించింది. విజయం సాధించిన మేయర్లు, పురపాలక ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎస్‌ఈసీ తాజాగా ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈనెల 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన కొత్త మేయర్లు, ఛైర్‌పర్సన్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఎస్‌ఈసీ అధికారికంగా ప్రకటించింది.