భారత్, చైనా, ఇరాక్, ఖతార్ దేశాల నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చు… కానీ ఇలా చెయ్యాలి ఇరాన్ మెలిక…!
ఇజ్రాయెల్ ప్రోద్బలంతో ఈ యుద్ధాన్ని స్ట్రాట్ చేసిన ట్రంప్ ఇప్పుడు పీక్కోలేక.. లాక్కోలేక ఇరాన్ యుద్ధాన్ని ఆపలేక ఆపసోపాలు పడుతున్నారు. ఇరాన్ గల్ఫ్ దేశాల చమురు ఆయువు పట్టుపై కొడుతూ హార్మూజ్ జలసంధిని మూసేసి ప్రపంచవ్యాప్తంగా చమురు మంటలు రాజేసింది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారత్, చైనా సహా ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆయిల్ ధరలు పెరిగి అరిగోసపడుతున్నాయి. యుద్ధం ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఆగుతూ.. సాగుతూ నడుస్తోంది. చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా ఏ షిప్ ను బయటకు పోనివ్వకుండా ఇరాన్ అమెరికానే కాదు ప్రపంచాన్ని తన కాళ్లకింద పెట్టుకుని ఆటలాడుతోంది.అయితే తాజాగా అమెరికాలో ట్రంప్ మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోవడం.. ఇజ్రాయెల్ లో నెతన్యాహుకు మెజార్టీ రాక హంగ్ ఏర్పడడంతో ఇక యుద్ధానికి బ్రేక్ పడుతుంది అనుకుందేమో కానీ ఇరాన్ కాస్త మెత్తబడింది. భారత్ సహా తమ మిత్ర దేశాల నౌకలకు హార్మూజ్ లో ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్టుగా ఇరాన్ విదేశాంగ విధాన కమిటీ డిప్యూటీ చైర్మన్ అమీర్ హయత్ పేర్కొన్నారు. భారత్, చైనా, ఇరాక్, ఖతార్ దేశాల నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చని ఇరాన్ ప్రకటించింది.
దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. భారత్ నుంచి పశ్చిమాసియా దేశాలకు ఔషధాల సరఫరాను సులభతరం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. అయితే చివరకు ట్విస్ట్ ఇచ్చింది. భారత్, చైనాల నౌకలను పోనివ్వడానికి అనుమతిస్తాం కానీ నౌకల నుంచి ఫీజు వసూలు చేస్తామని మెలిక పెట్టేసింది.