అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన తెలుగు వారు….!

తెలుగోళ్లు. కాలనీలకు కాలనీలు, ఏరియాలకు ఏరియాలు తెలుగోళ్లదే రాజ్యం. ఎందుకంటే మనోళ్ల దగ్గర టాలెంట్‌ ఉంది. వలసలను వ్యతిరేకించే ట్రంప్‌ అయినా, జాత్యహంకారంతో కొట్టుమిట్టాడో మరో అధ్యక్షుడొచ్చినా తెలుగోళ్లని నెత్తిన పెట్టుకోవాల్సిందే. బతుకుజీవుడా అంటూ ఏదో ఒక ఉద్యోగం చేసుకుని బతికేయడం కాదు.. అమెరికన్లకు నాయకత్వం వహించే స్థాయికి ఎదుగుతోంది మన తెలుగుజాతి…

అమెరికా రాజకీయంలో భారత సంతతికి చెందిన ప్రజాప్రతినిధులు తమ ప్రభావాన్ని చాటుతున్నారు. తాజాగా జరిగిన యూఎస్ మధ్యంతర ఎన్నికల్లో (US Midterm Elections) తెలుగు మూలాలున్న డెమోక్రటిక్ నేత అరుణా మిల్లర్ (Aruna Miller) మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా విజయం సాధించారు..గవర్నర్ వెస్ మూర్‌తో కలిసి వరుసగా రెండోసారి ఈ కీలక పదవిని సొంతం చేసుకుని ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారు.

ఎవరీ అరుణా మిల్లర్?

అరుణా మిల్లర్ 1964 నవంబర్ 6న హైదరాబాద్‌లోని తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆమెకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు కుటుంబం అమెరికాకు వలస వెళ్ళింది. న్యూయార్క్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె, మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

ఆ తర్వాత ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీర్‌గా కాలీఫోర్నియా, వర్జీనియా, హవాయీ రాష్ట్రాల్లో దాదాపు 25 ఏళ్ల పాటు సేవలు అందించారు. రోడ్డు భద్రత, ప్రజా రవాణా వ్యవస్థల ఆధునికీకరణ కోసం కృషి చేశారు. 1990లో మేరీల్యాండ్‌లోని మోంట్‌గోమరీ కౌంటీకి మారి అక్కడ స్థిరపడ్డారు. 2010లో తొలిసారి మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌కు ఎన్నికై 2018 వరకు ప్రజాప్రతినిధిగా సేవలు అందించారు….మొదటి సారి రికార్డు

2022లో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలుపొంది, ఆ రాష్ట్రంలో అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ పదవిని అధిరోహించిన తొలి దక్షిణాసియా మహిళగా నిలిచారు. ఇప్పుడు మరోసారి గెలిచి తమ పట్టును నిరూపించుకున్నారు.

తెలుగు మూలాలు, సంస్కృతిపై మక్కువ

అమెరికాలో దశాబ్దాలుగా స్థిరపడినప్పటికీ తన భారతీయ మూలాలను, తెలుగు భాషను అరుణ మరచిపోలేదు.
“చిన్నతనంలో విజయవాడలో అమ్మమ్మ దగ్గర పెరిగాను. ఇప్పటికీ నేను తెలుగు స్పష్టంగా మాట్లాడగలను. శాకాహారానికే ప్రాధాన్యత ఇస్తాను. సాంబారు, గోంగూర, వంకాయ కూరలు, నిల్వ పచ్చళ్లు ఎంతో ఇష్టంగా తింటాను” అని అరుణ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తొలిసారి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో భగవద్గీతపై చేయి ఉంచి ప్రమాణం చేయడం ద్వారా భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత పట్ల తనకున్న గౌరవాన్ని ఆమె చాటుకున్నారు..

అమెరికాలో మిడ్‌టర్మ్‌ ఎలక్షన్స్‌ జరుగుతున్నాయి. ట్రంప్‌ సంగతెలా ఉన్నా భారత సంతతివారు మాత్రం బస్తీమే సవాల్‌ అంటున్నారు. గవర్నర్‌ నుంచి సెనేటర్‌ దాకా, కౌన్సిల్‌ మెంబర్స్‌ నుంచి మేయర్‌ పదవుల దాకా పోటీపడుతున్నారు. అమెరికా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించబోతున్నారు. అమెరికన్లు మనోళ్లకు ఓటేస్తారో లేదోనని టెన్షన్‌ పడాల్సినపన్లేదు. అమెరికాలో భారతీయులే 52లక్షలమంది ఉన్నారు. ఎప్పుడో 70ఏళ్లక్రితమే అమెరికా ప్రతినిధులసభకు భారతీయుడు ఎన్నికైన ట్రాక్‌ రికార్డు కూడా ఉంది.

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌పార్టీ తరపున వివేక్‌ రామస్వామి ఒహాయో గవర్నర్‌గా పోటీపడుతున్నారు. ఆయన గెలిస్తే బాబీ జిందాల్‌, నిక్కీహేలీ తర్వాత మూడో భారత సంతతి గవర్నర్‌ అవుతారు. ఇక హైదరాబాద్‌లో పుట్టిన అరుణా మిల్లర్‌ మేరిల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా మరోసారి గెలిచేందుకు పోటీపడుతున్నారు. అమెరికాలో రెండో అతిపెద్ద నగరం లాస్ఏంజెల్స్‌ మేయర్‌ పదవికి పోటీపడుతున్న నిత్యారామన్‌ కూడా భారతీయురాలే. ఇక డెమాక్రాట్‌ పార్టీ నుంచి మళ్లీ బరిలో ఉన్న నలుగురు కాంగ్రెస్‌ సిటింగ్‌ సభ్యులు కూడా భారతీయులే.

ఫ్లోరిడా నుంచి పియా దాండియా, ఆరిజోనాలో అమీష్‌ షా, మిషిగన్‌లో రంజీవ్‌పురీ, న్యూయర్స్‌లో సరితా కోమటిరెడ్డి, న్యూయార్క్‌లో లిసాకౌల్‌, విస్సాన్సిన్‌లో జోష్ కౌల్‌, టెక్సాస్‌లో పూజాసేథీ, జార్జియాలో సుచితాపటేల్‌, వాషింగ్టన్ డీసీలో అపర్ణారాజ్‌.. వీళ్లంతా భారతీయులే. భారతీయ మూలాలున్నోళ్లే. అందులో కొందరు మన తెలుగోళ్లే. ఇదికదా అసలు కిక్కంటే!