కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ కాంటాక్ట్ పార్టీ కాదు..రాజగోపాల్ రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వంపై సంచలన కామెంట్స్…!

*యాదాద్రి భువనగిరి జిల్లా.*

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వంపై హాట్ కామెంట్స్……

కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ కాంటాక్ట్ల పార్టీ కాదు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెరలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నూతన చేయూత పెన్షన్ల మంజూరి పత్రాలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ,ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తో కలిసి లబ్ది దారులకు పంపిణి చేశారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ…….
పెన్షన్ లు ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులు చేనేత గీత కార్మికులకు ఇవ్వడంతో పాటు వృద్ధులకు కూడా ఇస్తే బాగుండేది అని అన్నారు. ప్రభుత్వం ఉన్నది కాంట్రాక్టర్ల కోసం, పెట్టుబడిదారుల కోసం కాదు పేదల కోసం అని అన్నారు.వృధ్యాప్య పింఛన్ల అలాగే పెన్షన్ ల పెంపు విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాననీ అన్నారు.
పెన్షన్ల పెంపు అనేది కాంగ్రెస్ పార్టీ మ్యాపిపేస్టో లో4000కాదు 5000ఇచ్చిన తక్కువే కాబట్టి కచ్చితంగా పెంచాలి, పెంచేదాకా మీకోసం నేను కొట్లాడుతానని ఎమ్మెల్యే అన్నారు.ప్రభుత్వం లో అభివృద్ధి పేరుమీద అవినీతి జరగకూడదు అని అన్నారు. ప్రభుత్వం వచ్చిన ఇప్పటికీ అనుకున్న స్థాయిలో పేదవాళ్లకు న్యాయం జరగలేదని ఆలోచనలో ప్రజలు ఉన్నారు అని ప్రభుత్వాన్ని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని పేదల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు… ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పనిచేయలేకపోతుందని అన్నారు.. పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఇందిరమ్మ రాజ్యం వస్తే బాగుంటుందని ఎంతోమంది ఆశగా ఎదురు చూశారని కానీ వచ్చిన తర్వాత అదే స్థాయిలో పనిచేయడంలో ఒక అడుగు వెనక్కి పడ్డామని స్వయంగా ప్రభుత్వంపై అధికార పార్టీ విమర్శలు గుప్పించడంతో ఒక్కసారిగా ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..