కశ్మీర్‌లోని కుల్గాంలో లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాది లతీఫ్ భట్‌ను భద్రతా దళాలు హతమార్చాయి. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్(CRPF), నిఘా సంస్థల సిబ్బందిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందించారు…కాశ్మీర్ లోయలో క్రియాశీలకంగా ఉన్న చివరి స్థానిక ఉగ్రవాది లతీఫ్ భట్ అని ఆయన పేర్కొన్నారు. బుధవారం తెల్లవారుజామున కుల్గాంలో భద్రతా దళాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్‌ను హతమార్చాయి.
అన్ని భద్రతా సంస్థల మధ్య అద్భుతమైన సమన్వయం కనిపించిందని అమిత్ షా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బంది ధైర్యసాహసాలను దేశం అభినందిస్తోందని ఆయన అన్నారు. లతీఫ్ భట్ సహచరుడిగా భావిస్తున్న మరో ఉగ్రవాది ఉమర్ నిసార్ కూడా అంతకుముందు రోజు కుల్గాంలో జరిగిన మరో ఎన్కౌంటర్లో హతమైనట్లు అమిత్ షా తన పోస్టులో వెల్లడించారు..
మసీదులో దాక్కున్న లతీఫ్ భట్..
కుల్గాం జిల్లాలోని జంగల్పోరా ప్రాంతంలో భద్రతా బలగాలు లతీఫ్ సమాచారం తెలిసి చుట్టుముట్టాయి. లతీఫ్ లొంగిపోయేలా భద్రతా బలగాలు వీడియో కాల్ చేసి ఒప్పించే ప్రయత్నం చేశాయి. ”అల్లా తప్ప నాతో ఎవరూ లేరు” అని లతీఫ్ చెబుతూ లొంగిపోవడానికి నిరాకరించాడు. తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో లతీఫ్ మసీదు కాల్పులు జరపడంతో, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపి ఉగ్రవాదిని హతమర్చాచి…..2025 నవంబర్‌లో లతీఫ్ భట్ లష్కరే తోయిబాలో చేరాడు. ఉగ్రవాదానికి ఆకర్షితుడైన లతీఫ్‌కు పాకిస్తాన్ నుంచి ఆదేశాలు అందేవని అధికారులు చెబుతున్నారు. శాంతిభద్రతలు, పర్యాటక రంగానికి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించేలా కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడికి లతీఫ్ ప్రధాన సూత్రధారిగా చెబుతున్నారు. లష్కరే తోయిబాలో చేరిన ఏడాదికే భద్రతా బలగాల చేతిలో హతమయ్యాడు.