ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాను..– కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

మూడేళ్లుగా రేవంత్ రెడ్డి భాష చూసి ఎర్రి కుక్క ఎవరిని కరిచిందో ప్రజలకు అర్థం అయింది..

అయ్యప్ప మాలలో ఉండి కళ్ళు నెత్తికి ఎక్కి మాట్లాడుతున్నాడు అని నేను అనలేను..

ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాను..– కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు ఇచ్చిన హామీ మేరకు తనకు మంత్రి పదవి ఇవ్వలేదంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. ఈక్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేయగా అందుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘మా వాళ్లలో కొందరికి ఎర్రి కుక్కలు కరిచినట్లుంది. అలాంటి వారిని కాంగ్రెస్ కార్యకర్తలే ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి తరలిస్తారు’అని చెప్పుకొచ్చారు. ఇందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మూడేళ్లుగా రేవంత్ రెడ్డి భాష చూసి ఎర్రి కుక్క ఎవరిని కరిచిందో ప్రజలకు అర్థం అయింది అంటూ దెప్పిపొడిచారు..

రేవంత్ రెడ్డికి బుద్ది ప్రసాదించాలని అయ్యప్పస్వామిని వేడుకుంటున్నా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎర్రికుక్కలు కరిచాయా? అంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ…దుర్మార్గపు పాలన సాగించే పాలకులను తెలంగాణ ప్రజానీకం, చరిత్ర ఎన్నిటికీ క్షమించదు. తనను ఎర్రి కుక్క కరిచింది అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మూడేళ్లుగా రేవంత్ రెడ్డి భాష చూసి ఎర్రి కుక్క ఎవరిని కరిచిందో ప్రజలకు అర్థం అయింది అని ఎద్దేవా చేశారు. అయ్యప్ప మాలలో ఉండి కళ్ళు నెత్తికి ఎక్కి మాట్లాడుతున్నాడు అని తాను అనలేదు అని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు..