రేవంత్ రెడ్డి కూతురు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు నిర్మిస్తున్న కార్పొరేట్ స్కూల్స్ కోసం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేశారు..– కేటీఆర్.
రేవంత్ రెడ్డి కూతురు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు నిర్మిస్తున్న కార్పొరేట్ స్కూల్స్ కోసం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేశారు..– కేటీఆర్..
బీఆర్ఎస్ హయాంలో నాడు హైదరాబాద్ పక్కన ఫార్మా సిటీ అని భూమి సేకరిస్తే రేవంత్ రెడ్డి దాని పేరు మార్చి ఇప్పుడు దాన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. అది కాదు ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ ఉన్న సిటీ మన వరంగల్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం హనుమకొండ కాకతీయ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో జన చైతన్య సభకు జనం పోటెత్తారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై కేటీఆర్ మాట్లాడారు. మూడేండ్ల పాలనలో రేవంత్ రెడ్డి వరంగల్‌కు ఒక్క పరిశ్రమ అయినా తెచ్చావా ? అని సూటిగా ప్రశ్నించారు. పరిశ్రమలు తేకపోగా ఉన్నవి మూసి వేస్తున్నారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో మన వరంగల్ నగరాన్ని ఫ్యూచర్ సిటీ చేసే బాధ్యత నేనే తీసుకుంటానని హామీనిచ్చారు…
వరంగల్ అంటేనే ఒక ఉత్తేజం, ఒక ఉద్వేగం, ఉద్యమం కాతీయుల ధిక్కారానినికి, కాళోజీ పౌరుషానికి, జయశంకర్ ఆలోచనకు ప్రతీక స్ఫూర్తినిచ్చే గడ్డ వరంగల్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని అన్నారు. ఆదివారం హనుమకొండ కాకతీయ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో జన చైతన్య సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ పదేండ్ల పాలన చూశారు. కరోనా వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదు. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ కోతలు, నీటి సమస్యలు లేవు. ఎన్నికల్లో తప్పుడు వాగ్ధానాలు ఇవ్వలేదు. ఎలక్షన్స్‌లో కల్యాణ లక్ష్మి, రైతు బీమా, ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తానని చెప్పలేదు..మంచి మనసుతో ఇవన్నీ చేశారు. ఓరుగల్లు పోరుగల్లు పౌరుషం కేసీఆర్ మొండి పట్టుదలో కనిపిస్తుంది. ఆనాడు రూ.200 పెన్షన్‌ను కేసీఆర్ రూ.2000 పెంచాడని గుర్తు చేశారు. పేదింటి ఆడబిడ్డకు మేనమామలా మారి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అందజేశారు. పేద వారికి ఇండ్ల పట్టాలు ఇచ్చి ఆదుకున్నాం. కానీ, కాంగ్రెస్‌కు ఇది కడుపు మండి మాయమాటలు చెప్పి 420 మామీలు ఇచ్చి ఇద్దరు పదురుకొని కేసీఆర్ ని ఓడించారు. రేవంత్ రెడ్డి నిజాయితీపరుడైన మోసగాడు. ఎనకటి రోజులు వస్తయని చెప్పాడు. అన్నట్లుగా నీళ్లు, కరెంట్ లేదు, విత్తనాలు, పెన్షన్స్ లేవు ఇలా అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి మోసం చేశాడన్నారు.
రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరులను చేస్తానని ప్రగల్బాలు పలుకుతున్నాడు. నీకు దమ్ముంటే వారిని లక్షాదికారి చేయాలని సవాల్ విసిరారు. అంతకు ముందు కేటీఆర్ ఏకశిలా విద్యాసంస్థల అధినేత గౌరు తిరుపతిరెడ్డి, పలువురు మాజీ కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.