గ్రాడ్యుయేట్ ఓటర్ల డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ రోల్ ప్రచురించిన ఎన్నికల అధికారులు…!

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని రెండు ప్రధాన గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాను హైదరాబాద్‌లోని ఎన్నికల అధికారులు తాజాగా ప్రకటించారు…అధికారులు విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, రెండు నియోజకవర్గాల్లో కలిపి లక్షలాది మంది పట్టభద్రులు తమ ఓటు హక్కు కోసం పేరు నమోదు చేసుకున్నారు.

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్: ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం 5,68,105 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా జాబితా స్పష్టం చేస్తోంది.
వరంగల్ – ఖమ్మం – నల్గొండ: ఈ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. ఇక్కడ మొత్తం 6,21,086 మంది ఓటర్లు నమోదయ్యారు.
Telangana Graduate Votes: ఆన్‌లైన్‌లో జాబితాను ఎలా చెక్ చేసుకోవాలి?
పట్టభద్రులు తమ పేరు ముసాయిదా జాబితాలో ఉందో లేదో సులభంగా తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం ఆన్‌లైన్ సదుపాయం కల్పించింది. అర్హులైన ఓటర్లు అధికారిక వెబ్‌సైట్ అయిన ceotelangana.nic.in ను సందర్శించి తమ వివరాలను సరిచూసుకోవచ్చు.

అభ్యంతరాలు, తుది జాబితా ముఖ్య తేదీలు
ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపడానికి మరియు కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు.

చివరి గడువు: ఓటరు నమోదు, సవరణలు మరియు అభ్యంతరాల స్వీకరణకు డిసెంబర్ 10 వరకు సమయం ఉంది.
తుది జాబితా విడుదల: వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి, పరిష్కరించిన అనంతరం డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు.

గ్రాడ్యుయేట్ ఓటర్ల డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ రోల్ ప్రచురించిన ఎన్నికల అధికారులు.

మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో:
– 5.99 లక్షల దరఖాస్తులు.
– 5,68,105 దరఖాస్తులకు ఆమోదం.
– 31,314 దరఖాస్తుల తిరస్కరణ.
– 156 మండలాల పరిధిలో ఓటరు జాబితా ప్రక్రియ పూర్తి.

వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో:
– 6.70 లక్షల దరఖాస్తులు.
– 6,21,086 దరఖాస్తులకు ఆమోదం.
– 49,321 దరఖాస్తుల తిరస్కరణ.
– 192 మండలాల పరిధిలో డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురణ.

రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో
– 12,69,826 దరఖాస్తులు రాగా..
– మొత్తం 11,89,191 దరఖాస్తులకు ఆమోదం.
– 80,635 దరఖాస్తులు తిరస్కరణ

ఈ క్రిందిలింక్ ఓపెన్ చేసి మీ ఓటు వివరాలు చెక్ చేసుకోగలరు:

MLC Roll – CEO Telangana https://share.google/TofGceaIB0dE6ZdbK