భారత రక్షణ రంగం మరో కీలక మైలురాయిని చేరుకుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘భార్గవాస్త్ర’ (Bhargavastra) యాంటీ-డ్రోన్ వ్యవస్థ పరీక్షలు రాజస్థాన్‌లోని పోఖ్రాన్ (Pokhran) ఫైరింగ్ రేంజ్లో విజయవంతమయ్యాయి. నాగ్‌పూర్‌కు చెందిన సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (SDAL) సంస్థ దీనిని అభివృద్ధి చేసింది..
డ్రోన్లు, డ్రోన్ స్వార్మ్(గుంపులుగా వచ్చే డ్రోన్లు)లకు చెక్ పెట్టేలా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన ద్వారా ఎదురయ్యే వేగంగా మారుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు రూపొందించిన స్వదేశీ ‘భార్గవాస్త్ర’ (Bhargavastra) కౌంటర్-డ్రోన్ వ్యవస్థ ట్రయల్ టెస్టులు సక్సెస్ అయ్యాయి..రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. దేశంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన,వాహనంపై అమర్చే విధంగా రూపుదిద్దుకున్న కౌంటర్-స్వార్మ్ డ్రోన్ వ్యవస్థ ఇదే కావడం గమనార్హం.
‘సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (SDAL)’ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ పరీక్షలు నవంబర్ 20 నుంచి 24 వరకు జరిగాయి. శత్రువుల నుంచి గుంపులుగా వచ్చే డ్రోన్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ వ్యవస్థను రూపొందించారు.
రెండు అంచెల రక్షణ..
భార్గవాస్త్ర మొబైల్, మల్లీ లేయర్డర్ రక్షణ వ్యవస్థ. ఇది శత్రు డ్రోన్లు, ఆయుధాలు కలిగిన మానవరహిత వైమానిక వాహనాలు (UAVs), లోయిటరింగ్ మ్యూనిషన్స్, స్వయంచాలక (autonomous) డ్రోన్ స్వార్మ్‌లను ధ్వంసం చేయగలదు. గగనతల ముప్పును అడ్డుకుని నాశనం చేయడాని ఇది అన్ గైడెడ్ రాకెట్లు, ప్రెసిషన్ మైక్రో మిస్సైళ్లను ప్రయోగిస్తుంది. దీని రెండంచెల డిజైన్ విభిన్న రకాల డ్రోన్ల ముప్పును ఎదుర్కోగలదు..
10 కిలోమీటర్ల దూరంలోనే గుర్తింపు…!
జామర్లకు దొరకని సమాధానం!
సాధారణంగా డ్రోన్లను నిలువరించడానికి ఎలక్ట్రానిక్ జామర్లు లేదా రేడియో సిగ్నళ్లను నిలిపివేసే పద్ధతులు వాడతారు. కానీ అధునాతన ఆటోమేటిక్ డ్రోన్లు ఇటువంటి జామర్లకు దొరకవు. అందుకే భార్గవాస్త్ర ప్రత్యక్ష దాడి పద్ధతిని ఎంచుకుంది. 10 కిలోమీటర్ల దూరంలోనే పెద్ద డ్రోన్లను, దగ్గరగా వచ్చే చిన్న డ్రోన్లను కూడా అత్యాధునిక రాడార్లు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ల సహాయంతో ఇది పసిగడుతుంది. ఆ తర్వాత మైక్రో-రాకెట్లు, నిశిత లక్ష్యాలను ఛేదించే మైక్రో-మిస్సైళ్లతో శత్రు డ్రోన్లను నిమిషాల వ్యవధిలో నాశనం చేస్తుంది.