నాగార్జున సాగర్‌ ( Nagarjuna Sagar) నీటి విడుదల విషయంలో ఉద్రిక్తత…ముందస్తు సమాచారం లేకుండా ముందుగా నీరు విడుదల..

నాగార్జున సాగర్‌ ( Nagarjuna Sagar) నీటి విడుదల విషయంలో ఉద్రిక్తత ( Tension) పరిస్థితులు నెలకొన్నాయి. సాగర్‌ కుడి కాలువ నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ముందుగా ఆంధ్రప్రదేశ్‌ 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా పోటీగా తెలంగాణ అధికారులు ఎడమ కాలువ ద్వారా 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇప్పటికే పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సాగర్‌ నీటి విడుదల చర్చంశనీయంగా మారింది.

Telangana’s Nagarjuna Sagar …..నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారుల మధ్య పోటాపోటీ నీటి విడుదల కారణంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎటువంటి ముందస్తు సమాచారం మరియు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) అనుమతులు లేకుండానే ఆంధ్రప్రదేశ్ కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయడంతో ఈ వివాదం తలెత్తింది.

ఎల్నినోతో కరువొచ్చి చుక్కనీటికీ జనం అరిగోసపడ్తుంటే, మరోదిక్కు కనీస కనికరం లేకుండా సాగర్ కు గండికొట్టడంపై తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఏపీసీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ కు కొత్తగా ఎలాంటి ప్రాజెక్టూ ఇవ్వకుండా గోసపుచ్చుకున్న బాబు, రాష్ట్రం విడిపోయాక సైతం నీడలా వెంటాడుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు రూపంలో శ్రీశైలానికి పొక్కకొట్టిన ఏపీ.. కృష్ణా డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తోడుకుంటున్న సంగతి తెలిసిందే!

ఇది చాలదన్నట్లు ఇప్పుడు బాబు నేరుగా సాగర్ డెడ్ స్టోరేజ్ కీ గురిపెట్టాడు. పల్నాడు వాటర్.

గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా సాగర్ లో 510 అడుగుల కన్నాదిగువ నుంచి నీటిని ఖాళీ చేసేలా పనులు చేస్తున్నాడు. ఇది పూర్తయితే కరువు పూట హైదరాబాద్ కు తాగునీటి గండం తప్పదు. మరోవైపు కేంద్రంలో భాగస్వామ్యాన్ని అడ్డుపెట్టుకొని బసకచర్ల ప్రాజెక్ట్ కు అనుమతులు తెచ్చుకునేందుకు బాబు చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్నీకావు ఇందుకోసం తెలంగాణాలోని ఇచ్చంపల్లి నుంచి తలపై ట్టిన గోదావరి – కావేరీ లింకు సోర్సు పాయింట్ ను సైతం మార్చే ప్రయత్నాల్లో ఉన్నాడు.

నాగార్జునసాగర్ రిజర్వాయర్ కుడివైపున ఏపీ భూ భాగంలోని విజయపురి సౌత్ సమీపంలో ‘పల్నాడు. వాటర్ గ్రిడ్’ పేరుతో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. సుమారు రూ.1,200 కోట్ల వ్యయంతో 1.865 టీఎంసీలు తరలించేలా చేపట్టిన ఈ పథకం ద్వారా 510 అడుగుల స్థాయిలో అంటే కనిష్ట నీటిమట్టం దాదాపు 155.45 మీటర్లకు దిగువన సుమారు 150 మీటర్ల వద్ద మూడు ఇన్ టేక్ వెల్స్, సొరంగం, దాదాపు 1,650 కిలోమీటర్ల పైప్ లైన్ నెట్ వర్క్ నిర్మిస్తున్నది.

వాస్తవానికి ఈ ప్రా జెక్టుకు గతేడాదే చంద్రబాబు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. 2025 మేలోనే ప్రకాశం. .ధవళేశ్వరం బ్యారేజీల నుంచి తాగునీటి అవసరాల కోసం వివిధ ప్రాజెక్టులను జల్ జీవన్ మిషన్ కింద చేపడుతున్న ట్టు జీవో విడుదల చేసింది. దానికి కొనసాగింపుగానే ఈ ఏడాది ఆగస్టులో పల్నాడు వాటర్ గ్రిడ్ కు జీవో ఇచ్చింది. జీవో ఈ ఏడాది ఇచ్చినా.. పనులు మాత్రం అంతకు ముందే ప్రారంభించారన్న వాదనలూ ఉన్నాయి..

బనకచర్ల అని ఒకసారి..నల్లమలసాగర్ అని మరోసారి…

గోదావరిలో మిగులు జలాలుగానీ.. వరద జలాలు గానీ లేవని ఇప్పటికీ సెంట్రల్ వాటర్ కమిషన్ (సీ డబ్ల్యూసీ) ఎన్నో సందర్భాల్లో చెప్పింది. అసలు వాటి టెక్కే తేలలేదని స్పష్టం చేసింది. కానీ, ఆ లెక్కలేవీ తేలకుండానే బనకచర్ల ప్రాజెక్టును కట్టేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు.2024లోనే దాని డిజైన్లు కూడా ఖరారుచేశారు. పోలవరం కుడి కాల్వ ద్వారా రోజూ 2 టీఎంసీల చొప్పున వంద రోజుల్లో 200 టీఎంసీల నీటిని ఎత్తిపోసి టన్నెళ్లు, కాల్వల ద్వారా 400 కిలోమీటర్ల దూరం లోని చన క్రాస్ రెగ్యులేటర్ కు తరలించాలన్నది ఆయన వ్యూహం. అందుకు మధ్యలో సాగర్ నూ వాడేసుకున్నారు.

కుడికాల్వ దగ్గర కెనాల్ వెడల్పు చేయడం. అక్కడ ఆక్విడక్ట్ ను నిర్మించడం అక్కడి నుంచి 150 టీఎంసీల సా మర్ద్యంతో నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్ కు తర లించడం ప్లాన్లోభాగం. ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు తలచుకున్న అంచనా వ్యయం రూ.81,900 కోట్లు. ఈ నిధుల కోసం ప్రత్యేకంగా జలహారతి అనే కార్పొ రేషన్ ను నిరుడు ఏర్పాటు చేశారు.

నాగార్జునసాగర్‌ జలాల పంపిణీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తదుపరి జరిగే బోర్డు సమావేశంలోనే నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సిఫారసు చేసింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని కేఆర్‌ఎంబీ కార్యాలయంలో ఈ నెల 23న జరిగిన సమావేశం మినిట్స్‌ను బుధవారం విడుదల చేసింది. కేఆర్‌ఎంబీ లెక్కల ప్రకారం.. ఈనెల 23 నాటికి నాగార్జునసాగర్‌లో 510 అడుగుల కనీస నీటిమట్టం(ఎండీడీఎల్‌) పైన 45.40 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది..