తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వద్దు వెలిగించడానికి వచ్చిన CRPF కి ఘనస్వాగతం..!
దీపం వద్దు వెలిగించడానికి వచ్చిన CRPF కి ఘనస్వాగతం
తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండపై (Thiruparankundram Hill) కార్తీక దీపం వెలిగించే కార్యక్రమానికి భద్రత కల్పించేందుకు వచ్చిన CRPF (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) బలగాలకు స్థానికులు మరియు భక్తులు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు..
కొండపై దర్గా సమీపంలో దీపం వెలిగించడం వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తమిళనాడు ప్రభుత్వం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులు అమలు కాకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆలయ మరియు కొండ ప్రాంత భద్రతా బాధ్యతలను కేంద్ర బలగాలకు (CRPF) అప్పగించింది..సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుమారు 130 మంది CRPF జవాన్లు మదురైలోని తిరుప్పరంకుండ్రం చేరుకున్నారు. కొండ మార్గంలో నడుస్తున్న జవాన్లపై, వారి వాహనాలపై స్థానికులు, భక్తులు గులాబీ పూల రేకులు చల్లుతూ, డప్పు వాయిద్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు..• ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా CRPF బలగాలు కొండపై పూర్తి నిఘా ఏర్పాటు చేశాయి. భద్రతా కారణాల దృష్ట్యా పరిమిత సంఖ్యలో (50 మంది) భక్తులను మాత్రమే కొండపైకి అనుమతించారు.
• సామరస్య ఏర్పాట్లు: దీపం వెలిగించే కార్యక్రమంతో పాటు కొండపై ఉన్న దర్గాలో ముస్లిం భక్తులు ప్రార్థనలు చేసుకోవడానికి కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.