భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 246 పరుగులకు ఆలౌట్ అయింది..ఓవర్ నైట్ స్కోర్ 116/6తో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత్.. మరో 130 పరుగులు జోడించింది. ధ్రువ్ జురెల్(88) హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడు మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్.. 356 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో కివీస్‌పై భారత్ ఇంకా 110 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది..యశస్వి జైస్వాల్(0), కేఎల్ రాహుల్(25), దేవదత్ పడిక్కల్(21), శుభ్‌మన్ గిల్(17), రిషభ్ పంత్(23), వాషింగ్టన్ సుందర్(10), అన్షుల్ కాంబోజ్(0), ఆకాశ్ దీప్(29), గుర్నూర్ బ్రార్(10) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. బుమ్రా(4*) నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో జెమీసన్ 4 వికెట్లతో చెలరేగాడు. స్మిత్ 2, డఫీ 2, హెన్రీ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు..
న్యూజిలాండ్‌తో టెస్టు: జురెల్ సెంచరీ మిస్.. 246 పరుగులకే భారత్ ఆలౌట్..
భారత్ కాలమాన ప్రకారం.
ఉదయం.8 గంటల సమయానికి..
22/0.. న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తుంది…