అమెరికా లాస్‌ ఏంజెల్స్‌లో భూకంపం.

అమెరికా లాస్‌ ఏంజెల్స్‌లో భూకంపం.

భూకంప తీవ్రత 5.2గా నమోదు
ఎయిర్‌పోర్ట్‌ సహా పలు భవనాల్లో పగిలిన అద్దాలు.

భయంతో పరుగులు తీసిన జనం..

లాస్ ఏంజెల్స్ సమీపంలో భూకంప కేంద్రం

ఈ భూకంప కేంద్రం లాస్ ఏంజెల్స్ నగరానికి నైరుతి దిశలో ఉన్న మాన్‌హట్టన్ బీచ్ తీర ప్రాంతానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం తర్వాత వచ్చిన ప్రకంపనలతో పసడీనా ప్రాంతంలోని చారిత్రక రోజ్ బౌల్ స్టేడియంలోని ప్రెస్ బాక్స్ కూడా కదిలింది. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు…

అమెరికాలోని కాలిఫోర్నియాలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. దక్షిణ కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాలు ఒక్కసారిగా కంపించాయి. రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రత నమోదైంది. భూకంపం తర్వాత కూడా పలుమార్లు ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. విమానాశ్రయంలోనూ కొంతసేపు గందరగోళం నెలకొంది. ల్యాండింగ్‌కు సిద్ధమైన కొన్ని విమానాలను వెనక్కి పంపినట్లు సమాచారం..

అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ (USGS) ఈ భూకంపాన్ని నమోదు చేసింది. లాస్ ఏంజెలెస్ సహా విస్తృత ప్రాంతంలో ఈ కంపనం అనుభవించారు. థాంక్స్ గివింగ్ తరువాత రెండు రోజులు, బిజీ ట్రావెల్ వీకెండ్ సమయంలో ఈ భూకంపం జరిగింది.

లాస్ ఏంజిల్స్ కౌంటీలోని కాలిఫోర్నియా యొక్క అత్యంత జనాదరణ పొందిన బీచ్ కమ్యూనిటీలలో ఒకదానిని భూకంపం .యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు లాస్ ఏంజిల్స్ కౌంటీలోని మాన్‌హట్టన్ బీచ్ తీరానికి సుమారు 4 మైళ్ల దూరంలో, 7.6 మైళ్ల లోతులో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.