జర్నలిస్టుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి జర్నలిస్టు సంఘం..
సూర్యాపేట జిల్లా.
హుజూర్నగర్ నియోజకవర్గం పాలకీడు మండల కేంద్రం జాన్ పహాడ్ దర్గా వద్ద గత రెండు రోజుల క్రితం జర్నలిస్టు 6టీవీ రిపోర్టర్ వెచ్చ సందీప్ పై కత్తులతో దాడి చేసి అత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పట్టుకొని వారిపై కఠినమైన శిక్షలు విధించాలని హుజూర్నగర్ నియోజకవర్గ జర్నలిస్టులు అందరూ కూడా ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
హుజూర్ పట్టణంలో పలు జర్నస్టుల సంఘాల ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి రాస్తారోకో చేసి నిరసన తెలపడం జరిగింది..ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించి జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకువచ్చి..జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని..అదేవిధంగా వెచ్చ సందీప్ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది..
గత కొన్ని నెలలుగా జర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగినట్లు పలువురు జర్నలిస్టుల ఆరోపించారు..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులపై దృష్టి పెట్టి, జర్నలిస్టులపై దాడి జరిగినప్పుడు కఠిన చట్టాలు తీసుకురావాలని లేని పక్షంలో, తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..
6టీవీ సందీప్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు..
అదేవిధంగా హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో డి.ఎస్.పి కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. జర్నలిస్టు పెద్దలు మాట్లాడుతూ రోజు రోజుకు జర్నలిస్టులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వాలు మారినా కూడా జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందని. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని రెండు రోజుల క్రితం 6టీవీ రిపోర్టర్ వచ్చే సందీప జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని. ఆత్యాయత్నానికి పాల్పడిన నిందితులపై కఠినమైన చర్యలు తీసుకొని వారికి శిక్ష పడే విధంగా చూడాలని వారికి న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు కొనసాగుతాయని ఇదేవిధంగా జర్నలిస్టుపై దాడులు జరిగితే సహించేది లేదని వారు అన్నారు….అనంతరం డిఎస్పీ శ్రీధర్ రెడ్డి,సిఐ చరమందరాజులకు జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు.
ఇట్టి కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రింట్ అండ్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.