కమ్యూనిస్టులు ఉద్యమాలు చేపట్టాలి: తమ్మినేని.

* తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత గ్యారెంటీ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
* ఎన్నికలలో ప్రకటించిన ఉచిత గ్యారెంటీ పథకాల అమలు వెంటనే చేయాలని డిమాండ్ చేశారు.
* ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
ఇప్పటివరకు స్నేహపూర్వకంగా చెప్పాం..ఇక నుండి రోడ్ల పైకి వస్తాం అంటూ హెచ్చరించారు.
మాకు గెలవడం రాకపోయినా ఓడించడం వచ్చు అంటూ తమ్మినేని హాట్ కామెంట్స్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత గ్యారెంటీ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చింది. ఎన్నికలలో ప్రకటించిన ఉచిత గ్యారెంటీ పథకాలు అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్న నేటికీ అమలు జరగలేదు..
మహిళలకు ఉచిత బస్సు పథకం ఒక్కటే అమలు జరిగింది. రెండు లక్షల రుణమాఫీ కొంతమందికి లబ్ధి చేకూరింది. రైతు భరోసా నేటికీ అమలు జరగలేదు. మహిళలకు మహిళా శక్తి పథకం.. కార్మికులకు ఉపాధి పథకం అమలు కాలేదు.కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు గత పార్లమెంటు ఎన్నికలలో 28 పార్టీలతో ఇండియా కూటమిగా ఏర్పాటు చేసింది సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరినే అని పేర్కొన తమ్మినేని.. ఇండియా కూటమి బలంగా ఉండటం వల్ల బీజేపీ సీట్లను తగ్గించగలిగాం అని తెలిపారు..